సెమీస్‌కు దూసుకెళ్లిన సానియా జోడీ

హోబర్ట్: పునరాగమనంలో ఆడుతోన్న తొలి టోర్నీలోనే భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అదరగొడుతోంది. హోబర్ట్ ఇంటర్నేషనల్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్‌లో గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సానియా– నదియా కిచెనోక్ (ఉక్రెయిన్) ద్వయం 6–2, 4–6, 10–4తో అమెరికా ద్వయం క్రిస్టీనా మెక్‌హేల్–వనియా కింగ్‌పై గెలిచింది. గంటా 24 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ అద్భుతంగా ఆడింది. నేడు జరిగే సెమీస్‌లో పోరులో టమరా జిదాన్‌సెక్ (స్లోవేనియా)– మేరి బౌజ్‌కోవా (చెక్ రిపబ్లిక్) జోడీతో సానియా– కిచెనోక్ ద్వయం తలపడుతుంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి