ఐదో ర్యాంక్‌కు హారిక | Harika Dronavalli takes 5th in FIDE Rankings | Sakshi
Sakshi News home page

ఐదో ర్యాంక్‌కు హారిక

Jul 27 2016 11:11 AM | Updated on Sep 4 2017 6:35 AM

గత రెండు నెలల నుంచి అద్భుతంగా రాణిస్తున్న భారత గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక.. తన ర్యాంకింగ్‌ను కూడా గణనీయంగా మెరుగుపర్చుకుంది.

జియాజింగ్ (చైనా): గత రెండు నెలల నుంచి అద్భుతంగా రాణిస్తున్న భారత గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక.. తన ర్యాంకింగ్‌ను కూడా గణనీయంగా మెరుగుపర్చుకుంది. మంగళవారం విడుదల చేసిన ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్‌లో హారిక 10 నుంచి ఐదో స్థానానికి ఎగబాకింది. ఇటీవల చెంగ్డూలో జరిగిన మహిళల గ్రాండ్‌ప్రి టోర్నీ టైటిల్‌ను గెలవడం హారికకు బాగా కలిసొచ్చింది.

మరోవైపు చైనాలోనే జరుగుతున్న చైనీస్ చెస్ లీగ్‌లోనూ హారిక జైత్రయాత్ర కొనసాగిస్తోంది. షాన్‌డోంగ్ టీమ్ తరఫున వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. డు యుక్సిన్‌తో జరిగిన ఈ గేమ్‌లో హైదరాబాదీ పూర్తి ఆధిపత్యాన్ని చూపెట్టింది. టీమ్ షాంఘైకి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో గ్రాండ్ మాస్టర్ పెంటేల హరికృష్ణ... గ్జూ మింగ్‌యు (జియాంగ్ టీమ్)తో జరిగిన గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement