నాకేం తక్కువ: భజ్జీ 

Harbhajan Singh Comments ABout His Bowling Capacity - Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌ ఆడే సత్తా తనలో ఇంకా వుందని భారత వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ చెప్పుకొచ్చాడు. ఓ ఇంటర్వూ్యలో మాట్లాడుతూ ‘నేను ఆడేందుకు సిద్ధం. ఒక వేళ నేను ఐపీఎల్‌లో బాగా బౌలింగ్‌ చేస్తే... అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా అదే చేస్తాగా! బౌలర్లకు ఐపీఎల్‌ క్లిష్టమైన టోర్నమెంట్‌. ఎందుకంటే బౌండరీ దూరం తక్కువుండే ఈ టోర్నీల్లో ప్రపంచ మేటి ఆటగాళ్లంతా ఆడతారు. అలాంటి వారికి పవర్‌ ప్లే, మధ్య ఓవర్లలో బౌలింగ్‌ చేసి వికెట్లు పడగొట్టిన నాకు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడే సత్తా లేదంటారా చెప్పండి’ అని అన్నాడు. ప్రపంచ క్రికెట్లో అన్ని జట్లు బలమైనవి కావని... అదే ఐపీఎల్‌లో అయితే అత్యుత్తమ ఆటగాళ్లంతా కలసి ఆడటం వల్ల అన్ని జట్లు పటిష్టమైనవని భజ్జీ విశ్లేషించాడు. ‘ఈ లీగ్‌లో బెయిర్‌ స్టో (ఇంగ్లండ్‌), డేవిడ్‌ వార్నర్‌ (ఆసీస్‌) వికెట్లను తీయగలిగే నేను అంతర్జాతీయ క్రికెట్లో తీయలేనా? అయితే తిరిగి భారత్‌కు ఆడే అంశం నా చేతిలో లేదు. సెలక్షన్‌ కమిటీ చూడాలి’ అని ముక్తాయించాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top