వైభవంగా హర్భజన్ వివాహం | Harbhajan exposition marriage | Sakshi
Sakshi News home page

వైభవంగా హర్భజన్ వివాహం

Oct 30 2015 12:38 AM | Updated on Sep 3 2017 11:41 AM

వైభవంగా హర్భజన్ వివాహం

వైభవంగా హర్భజన్ వివాహం

భారత జట్టు సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఓ ఇంటివాడయ్యాడు.

జలంధర్: భారత జట్టు సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఓ ఇంటివాడయ్యాడు. గురువారం ఇక్కడి గురుద్వారలో ప్రియురాలు గీతా బస్రాను భజ్జీ వివాహం చేసుకున్నాడు. 35 ఏళ్ల హర్భజన్, బస్రా గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తెలుపు రంగు షేర్వాణీ, ఎర్రటి తలపాగా ధరించిన హర్భజన్ తమ సంప్రదాయానికి అనుగుణంగా చేతిలో కత్తి పట్టుకోగా... ఎరుపు, బంగారు లెహంగాతో పెళ్లి కూతురు బస్రా మెరిసింది.

వైభవంగా జరిగిన వీరి వివాహానికి సన్నిహితులు, బంధువులతో పాటు బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, అతని భార్య అంజలి హాజరయ్యారు. మరికొంతమంది క్రికెటర్లు ఈ ఆఫ్ స్పిన్నర్‌కు ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు. ఆదివారం ఢిల్లీలో రిసెప్షన్ జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు క్రికెటర్లు యువరాజ్, కోహ్లి, బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, షారుఖ్, ప్రియాంక తదితరులు రిసెప్షన్‌కు వచ్చే అవకాశం ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement