ఉప్పల్: భారత్–విండీస్ జట్ల మధ్య బుధవారం ఉప్పల్ స్టేడియంలో జరగనున్న టీ20 మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. పోలీసులు స్టేడియాన్ని అ«దీనంలోకి తీసుకున్నారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో అణువణువు గాలిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అనుమానితులున్నా అప్రమత్తమై అదుపులోకి తీసుకుంటున్నారు.
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి వినతి మేరకు వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు సులభంగా చేరుకునేందుకు సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి 12 వరకు 60పైగా ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. మరోవైపు అర్ధరాత్రి ఒంటి గంట వరకు కోచ్లను నడపనున్నట్లు మెట్రో రైల్ అధికారులు ప్రకటించారు. తొలిసారిగా అత్యాధునిక డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


