breaking news
India westindies ladies teams
-
INDvsWI: మ్యాచ్‌కు ఆధునిక డ్రోన్లతో నిఘా
ఉప్పల్: భారత్–విండీస్ జట్ల మధ్య బుధవారం ఉప్పల్ స్టేడియంలో జరగనున్న టీ20 మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. పోలీసులు స్టేడియాన్ని అ«దీనంలోకి తీసుకున్నారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో అణువణువు గాలిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అనుమానితులున్నా అప్రమత్తమై అదుపులోకి తీసుకుంటున్నారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి వినతి మేరకు వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు సులభంగా చేరుకునేందుకు సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి 12 వరకు 60పైగా ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. మరోవైపు అర్ధరాత్రి ఒంటి గంట వరకు కోచ్‌లను నడపనున్నట్లు మెట్రో రైల్ అధికారులు ప్రకటించారు. తొలిసారిగా అత్యాధునిక డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వేదం..విజయవిహారం
భారత్–వెస్టిండీస్ మహిళా జట్ల మధ్య మూలపాడులో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళా జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. మొదటి రెండు వన్డేల్లో బారత జట్టు మంచి విజయం సాధించింది. బుధవారం జరిగిన చివరి వన్డేలో చక్కటి బౌలింగ్, ఫీల్డింగ్‌తో విండీస్ జట్టును కట్టడిచేసి 15 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. నిలకడైన బ్యాట్స్ ఉమెన్ వేద కృష్ణమూర్తి బ్యాటింగ్‌కు ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. చివరి వన్డే అనంతరం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కోశాధికారి ఎంఏ రహీం, సెంట్రల్ జోన్ కార్యదర్శి కోకా రమేష్ భారత స్కిపర్‌కు ట్రోఫీ అందజేశారు. వరుసగా మూడు వన్డేల్లో ఓటమి చెందినా విండీస్ స్కిప్పర్ సిఫాన్ టేలర్ మూలపాడు గ్రౌండ్‌కు మొదటి ర్యాంకే ఇచ్చింది. ఇక్కడి ప్రేక్షకులు కూడా భారత జట్టుకు సమానంగా ఆ«దరించారని సంతోషం వ్యక్తం చేసింది. ఈనెల 18న టీ20 తొలిమ్యాచ్ ఈ స్టేడియంలోనే జరగనుంది. మ్యాచ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. - విజయవాడ స్పోర్ట్స్


