హిట్‌మ్యాన్‌కు స్పెషల్‌ డే..!

Happy Birthday Rohit Sharma, BCCI - Sakshi

ముంబై: టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 33వ బర్త్‌డేలో భాగంగా భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) శుభాకాంక్షలు తెలియజేసింది. ఈరోజు (ఏప్రిల్‌ 30) హిట్‌ మ్యాన్‌గా పిలవబడే రోహిత్‌ శర్మ తన జన్మదిన వేడుకల్ని జరుపుకుంటున్నాడు. హిట్‌ మ్యాన్‌కు స్పెషల్‌ డే అంటూ బీసీసీఐ అభినందనలు తెలిపింది. ఈ సీజన్‌ ఐపీఎల్‌ నిరవధిక వాయిదా పడటంతో ముంబై ఇండియన్స్‌ ఆటగాళ్లతో బర్త్‌ డేను సెలబ్రేట్‌ చేసుకునే అవకాశం రోహిత్‌కు దక్కలేదు. ఈసారి ఇంట్లోనే భార్య-కూతురితో కలిసి రోహిత్‌ పుట్టినరోజు వేడుకల్ని జరుపుకుంటున్నాడు. (ఫ్యాన్స్‌ లేకుండా మనం లేము.. )

2007లోనే భారత జట్టులో అరంగేట్రం చేసిన రోహిత్‌ శర్మకు ఆదిలో తన స్థానంపై భరోసా ఉండేది కాదు. ఆడప దడపా అవకాశాలతో అలా నెట్టికొచ్చిన రోహిత్‌.. 2013 నుంచి జట్టులో రెగ్యులర్‌ ఆటగాడిగా మారిపోయాడు. ఆ ఏడాది భారత జట్టు చాంపియన్‌ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన రోహిత్‌ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. తన ఆట తీరును మెరుగుపరుచుకుంటూ హిట్‌ మ్యాన్‌గా మారిపోయాడు. తన ఆటను విమర్శించిన వారికి బ్యాట్‌తోనే సమాధానం చెప్పి వారితోనే ప్రశంసలు అందుకున్నాడు. అతని కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను సాధించిన రోహిత్‌.. ప్రస్తుతం టీమిండియా కీలక ఆటగాడు. వన్డే క్రికెట్‌లో మూడు డబుల్‌ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌ ఘనత రోహిత్‌ది. ('ఇంత చెత్త ఫ్రాంచైజీని నేనెప్పుడు చూడలేదు')

రోహిత్‌ శర్మ పేరిట ఉన్న కొన్ని రికార్డులు..

*ఇంగ్లండ్‌ గడ్డపై హ్యాట్రిక్‌ శతకాలు బాదిన ఏకైక బ్యాట్స్‌మన్‌. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో రోహిత్‌ దీన్ని సాధించాడు. 
*వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రోహిత్‌(264)ది. 
*వన్డేల్లో మూడు డబుల్‌ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌
*ఒక వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక సెంచరీలు(5) చేసిన ఆటగాడు రోహిత్‌
*ఒక వన్డే వరల్డ్‌కప్‌లో ఛేజింగ్‌లో అత్యధిక శతకాలు(3) ఘనత కూడా రోహిత్‌దే.
*2019లో 10 శతకాలు బాదాడు. అయితే ఓ క్యాలెండర్ ఏడాదిలో 7 జట్లపై శతకాలు బాదిన తొలి క్రికెటర్‌గా రికార్డు.
*అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా అన్ని ఫార్మాట్లలో శతకాలు బాదిన ఏకైక భారత ఆటగాడు రోహిత్ శర్మ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top