ఆసియాకప్‌: 116కే హాంకాంగ్‌ ప్యాకప్‌ | Hang Kong All Out 116 Runs Against Pakistan | Sakshi
Sakshi News home page

Sep 16 2018 8:48 PM | Updated on Sep 16 2018 8:48 PM

Hang Kong All Out 116 Runs Against Pakistan - Sakshi

పాక్‌ బౌలర్‌ ఉస్మాన్‌ ఖాన్‌

దుబాయ్‌: ఆసియాకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పసికూన హాంకాంగ్‌ 116 పరుగులకే కుప్పకూలింది. పాక్‌ బౌలర్ల దాటికి హాంకాంగ్‌ బ్యాట్స్‌మన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న హాంకాంగ్‌ జట్టులో కేడీ షా (26), అయిజాజ్‌ ఖాన్‌(27)లదే టాప్‌ స్కోర్‌ కావడం విశేషం. పాక్‌ బౌలర్లలో ఉస్మాన్‌ ఖాన్‌ మూడు, హసన్‌ అలీ, షాదాబ్‌ ఖాన్‌లు రెండేసి వికెట్లు తీయగా.. అష్రాఫ్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు.

Advertisement
 
Advertisement
Advertisement