హంపికి రెండో గెలుపు | Hampiki second win | Sakshi
Sakshi News home page

హంపికి రెండో గెలుపు

Feb 22 2016 12:29 AM | Updated on Sep 3 2017 6:07 PM

ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి రెండో విజయాన్ని....

టెహ్రాన్ (ఇరాన్): ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగిన తొమ్మిదో రౌండ్‌లో హంపి 42 ఎత్తుల్లో వాలెంటినా గునీనా (రష్యా)పై గెలుపొందింది. నినో బాత్సియాష్‌విలి (జార్జియా)తో జరిగిన గేమ్‌ను ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 38 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. ప్రస్తుతం హంపి ఖాతాలో 4.5 పాయింట్లు... హారిక ఖాతాలో 3.5 పాయింట్లు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement