గుజరాత్‌ జెయింట్స్‌ జోరు | Gujarat Fortunegiants beat Patna Pirates | Sakshi
Sakshi News home page

గుజరాత్‌ జెయింట్స్‌ జోరు

Oct 8 2017 11:53 PM | Updated on Oct 8 2017 11:53 PM

Gujarat Fortunegiants beat Patna Pirates

జైపూర్‌: ఈ సీజన్‌ ప్రొ కబడ్డీ లీగ్‌లో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ జోరు కొనసాగుతోంది. ఈ టోర్నీలో ఆ జట్టు 13వ విజయాన్ని సాధించింది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ 33–29 స్కోరుతో పట్నా పైరేట్స్‌పై గెలిచింది. రైడింగ్‌లో 16 పాయింట్లతో పట్నా పైచేయి సాధించగా, టాకిల్‌లో గుజరాత్‌ డిఫెండర్లు 15 పాయింట్లతో అదరగొట్టారు. ఇరు జట్లు ఒక్కోసారి ఆలౌటయ్యాయి. గుజరాత్‌ రైడర్లలో మహేంద్ర రాజ్‌పుత్‌ (6), సచిన్‌ (5), అబొజర్‌ మిఘాని (4) రాణించారు.

డిఫెండర్‌ ఫజెల్‌ అత్రచలి 5 టాకిల్‌ పాయింట్లు చేశాడు. పట్నా జట్టులో మోను గోయత్‌ 6 పాయింట్లు చేయగా... విజయ్‌ (6) ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచాడు. మిగతా వారిలో పర్దీప్‌ నర్వాల్‌ 4, జవహర్‌ డాగర్‌ 2 పాయింట్లు సాధించారు. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో పుణేరి పల్టన్‌ 38–30 స్కోరుతో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై గెలుపొందింది.

Advertisement
 
Advertisement
Advertisement