గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ గెలుపు | Gujarat Fortune Giants Win | Sakshi
Sakshi News home page

గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ గెలుపు

Nov 5 2018 3:47 AM | Updated on Nov 5 2018 3:47 AM

Gujarat Fortune Giants Win - Sakshi

గ్రేటర్‌ నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన పోరులో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ 45–38తో దబంగ్‌ ఢిల్లీపై గెలుపొందింది. గుజరాత్‌ తరఫున డాంగ్‌ లీ 10, రోహిత్‌ గులియా 7 రైడ్‌ పాయింట్లతో సత్తా చాటగా... ట్యాక్లింగ్‌లో పర్వేశ్‌ 6 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. యూపీ యోధా, బెంగాల్‌ వారియర్స్‌ మధ్య జరిగిన మరో మ్యాచ్‌ 30–30తో ‘డ్రా’గా ముగిసింది. లీగ్‌లో నేడు విశ్రాంతి రోజు. మంగళవారం జరిగే మ్యాచ్‌ల్లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌తో హరియాణా స్టీలర్స్, యూపీ యోధాతో తెలుగు టైటాన్స్‌ తలపడతాయి.

Advertisement
 
Advertisement
Advertisement