breaking news
prokabaddi
-
గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ గెలుపు
గ్రేటర్ నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన పోరులో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 45–38తో దబంగ్ ఢిల్లీపై గెలుపొందింది. గుజరాత్ తరఫున డాంగ్ లీ 10, రోహిత్ గులియా 7 రైడ్ పాయింట్లతో సత్తా చాటగా... ట్యాక్లింగ్‌లో పర్వేశ్ 6 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. యూపీ యోధా, బెంగాల్ వారియర్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్ 30–30తో ‘డ్రా’గా ముగిసింది. లీగ్‌లో నేడు విశ్రాంతి రోజు. మంగళవారం జరిగే మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో హరియాణా స్టీలర్స్, యూపీ యోధాతో తెలుగు టైటాన్స్ తలపడతాయి. -
9 నుంచి రాష్ట్ర స్థాయి ప్రో కబడ్డీ పోటీలు
చిలుకూరు : చిలుకూరు ప్రో కబడ్డీ యూత్ ఆధ్వర్యంలో వచ్చే నెల 9 నుంచి∙11వ తేదీ వరకు మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర స్థాయి గ్రామీణ ప్రో కబడ్డీ్డ పోటీలను చిలుకూరులో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు షేక్ పాషా, అమరగాని లింగరాజు, యూసఫ్, షేక్ నాగులమీరా, అమరగాని నవీన్ తెలిపారు. పోటీలకు సంబంధించిన కరపత్రాన్ని గురువారం చిలుకూరులో ఆవిష్కరించారు. గెలుపొందిన వారికి మొదటి బహుమతి రూ. 10,016, ద్వితీయ రూ. 8016, తృతీయ రూ. 6016, చతుర్ద రూ. 4016, ఐదో బహుమతి రూ. 3016, ఆరో బహుమతి రూ. 2016తో పాటు ప్రత్యేక బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు 95026 45066, 90632 38305 నెంబర్లలో సంప్రదించి జట్టు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.