గుజరాత్‌ లయన్స్‌ కు మరో షాక్‌ | Gujarat all-rounder Dwayne Bravo ruled out of rest of IPL 2017 | Sakshi
Sakshi News home page

గుజరాత్‌ లయన్స్‌ కు మరో షాక్‌

Apr 23 2017 6:47 PM | Updated on Aug 21 2018 2:28 PM

గుజరాత్‌ లయన్స్‌ కు మరో షాక్‌ - Sakshi

గుజరాత్‌ లయన్స్‌ కు మరో షాక్‌

ఐపీఎల్‌-10లో వరుస ఓటములతో కుదేలైన గుజరాత్‌ లయన్స్‌ కు మరో ఎదురుదెబ్బ తగిలింది.

రాజ్‌కోట్‌: ఐపీఎల్‌-10లో వరుస ఓటములతో కుదేలైన గుజరాత్‌ లయన్స్‌ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా వెస్టిండీస్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావొ ఐపీఎల్‌ కు దూరమయ్యాడు. గుజరాత్‌ లయన్స్‌ కెప్టెన్‌ సురేశ్ రైనా ఈ విషయాన్ని ధ్రువీకరించాడు.

‘డ్వేన్‌ బ్రావొ టోర్నమెంట్‌ కు దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. అతడు ఫిట్‌నెస్‌ సాధించడానికి మరికొన్ని వారాలు పడుతుంది. అతడి స్థానంలో ఎవరి తీసుకోవాలనే దానిపై మేనేజ్‌మెంట్‌తో మాట్లాడుతున్నామ’ని రైనా తెలిపాడు.

ఐపీఎల్‌ లో మంచి రికార్డు కలిగిన బ్రావొ దూరం కావడం గుజరాత్‌ లయన్స్‌ కు ఎదురుదెబ్బేనని విశ్లేషకులు భావిస్తున్నారు. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న గుజరాత్‌ లయన్స్‌ ఈరోజు కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌ లో నెగ్గితే ప్లాయింట్ల పట్టిక ముందుకెళుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement