చైనాలో అతి పెద్ద స్టేడియం

Guangzhou to build China is largest professional football stadium - Sakshi

గ్వాంగ్జూ: ప్రపంచంలోనే అతి పెద్ద ఫుట్‌బాల్‌ స్టేడియం నిర్మాణానికి చైనా శ్రీకారం చుట్టింది. ‘ఫ్లవర్‌ సిటీ’గా పేరున్న గ్వాంగ్జూ నగరంలో కమలం ఆకారంలో ఈ స్టేడియం నిర్మిస్తున్నారు. చైనా జాతీయ ఫుట్‌బాల్‌ లీగ్‌ చాంపియన్‌ అయిన ‘గ్వాంగ్జూ ఎవర్‌గ్రాండ్‌’ టీమ్‌ యాజమాన్యం దీని రూపకర్త. ఈ జట్టు 2022లోగా దీనిని పూర్తి చేసి తమ హోమ్‌ గ్రౌండ్‌గా ఉపయోగించుకోనుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్దదైన బార్సిలోనా ఎఫ్‌సీ ‘క్యాంప్‌ నూ’ స్టేడియంకు మించి దాదాపు లక్షకు పైగా సామర్థ్యంతో కొత్త స్టేడియం నిర్మితమవుతోంది. గురువారం దీని పనులు ప్రారంభం కాగా మొత్తం బడ్జెట్‌ 1.7 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 13 వేల కోట్లు).

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top