మ్యాక్స్వెల్కు ఉద్వాసన! | Glenn Maxwell dropped from Australia ODI squad for Sri Lanka | Sakshi
Sakshi News home page

మ్యాక్స్వెల్కు ఉద్వాసన!

Aug 1 2016 4:20 PM | Updated on Sep 4 2017 7:22 AM

మ్యాక్స్వెల్కు ఉద్వాసన!

మ్యాక్స్వెల్కు ఉద్వాసన!

గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయిన ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు.

సిడ్నీ:గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయిన  ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్ అనంతరం జరిగే వన్డే సిరీస్కు మాక్స్ వెల్ను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు(సీఏ) పక్కన పెట్టేసింది. ఈ మేరకు ఆదివారం ప్రకటించిన వన్డే సిరీస్ జట్టులో మ్యాక్స్ వెల్ పై వేటు వేస్తూ ఆసీస్ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. గత నెల్లో  వెస్టిండీస్ తో జరిగిన వన్డే సిరీస్ లో మ్యాక్స్వెల్ ఘోరంగా విఫలం కావడంతో అతనిపై వేటు పడింది.

కాగా, హెన్రీక్యూస్, షాన్ మార్ష్లకు జట్టులో స్థానం కల్పించారు. విండీస్ పర్యటనలో స్థానం కోల్పోయిన ఆల్ రౌండర్ హెన్రీక్యూస్, బ్యాట్స్మన్ షాన్ మార్ష్లకు శ్రీలంకతో జరిగే 15 మంది సభ్యుల జట్టులో చోటు కల్పించారు. 2015లో హోబార్ట్ లో ఇంగ్లండ్ తో హెన్రీక్యూస్ చివరి వన్డే ఆడాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement