breaking news
Henriques
-
హెన్రిక్స్ మెరుపులు.. పుణే లక్ష్యం 177
పుణే: రైజింగ్ పుణే, సన్ రైజర్స్ హైదరాబాద్ ల మధ్య జరుగుతున్న మ్యాచ్ చివర్లో హెన్రిక్స్ మెరుపు బ్యాటింగ్ తో సన్ రైజర్స్ జట్టు గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది. పుణే బౌలర్లు కట్టు దిట్టంగా బౌలింగ్ చేయడంతో హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 177 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. సన్ రైజర్స్ ఓపెనర్లు వార్నర్, ధావన్ లు నెమ్మదిగా ఆడుతూ తొలి వికెట్ కు 55 పరుగులు జోడించారు. ధావన్(31) అవుటవ్వడంతో క్రీజులోకి వచ్చిన విలయమ్సన్ దూకుడుగా ఆడినా ఎక్కువ సేపు నిలవలేక పోయాడు. గత మ్యాచ్ లో విలయ తాండవం చూపించిన విలయమ్సన్ ఈ మ్యాచ్ లో ఒక ఫోర్ ఒక సిక్స్ తో 21 పరుగులు చేసి డాన్ క్రిస్టియన్ కు వికెట్ల ముందు దొరికి పోయాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన హెన్రీక్స్ తో వార్నర్ స్కోరు బోర్డును పరుగెత్తించాలని ప్రయత్నించిన పుణే బౌలర్ల కట్టు దిట్టమైన బంతులకు నిలదొక్కుకో లేకపోయింది. ఉనద్కత్ 17 ఓవర్లో వార్నర్ (43) ను అవుట్ చేసి 44 పరుగుల భాగస్వామ్యం అందించిన ఈ జంటను విడదీసాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన దీపక్ హుడాతో హెన్రిక్స్ దాటిగా ఆడాడు. ఉనద్కత్ వేసిన 19 ఓవర్లలో రెండు సిక్స్ లు కొట్టడంతో 15 పరుగులు వచ్చాయి. ఈ దశలో 25 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో హెన్రిక్స్ హాప్ సెంచరీ చేశాడు. చివరి ఓవర్లలో 15 పరుగులు రావడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 3 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. -
మ్యాక్స్‌వెల్‌కు ఉద్వాసన!
సిడ్నీ:గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయిన ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్ అనంతరం జరిగే వన్డే సిరీస్‌కు మాక్స్ వెల్‌ను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు(సీఏ) పక్కన పెట్టేసింది. ఈ మేరకు ఆదివారం ప్రకటించిన వన్డే సిరీస్ జట్టులో మ్యాక్స్ వెల్ పై వేటు వేస్తూ ఆసీస్ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. గత నెల్లో వెస్టిండీస్ తో జరిగిన వన్డే సిరీస్ లో మ్యాక్స్‌వెల్ ఘోరంగా విఫలం కావడంతో అతనిపై వేటు పడింది. కాగా, హెన్రీక్యూస్, షాన్ మార్ష్‌లకు జట్టులో స్థానం కల్పించారు. విండీస్ పర్యటనలో స్థానం కోల్పోయిన ఆల్ రౌండర్ హెన్రీక్యూస్, బ్యాట్స్‌మన్ షాన్ మార్ష్‌లకు శ్రీలంకతో జరిగే 15 మంది సభ్యుల జట్టులో చోటు కల్పించారు. 2015లో హోబార్ట్ లో ఇంగ్లండ్ తో హెన్రీక్యూస్ చివరి వన్డే ఆడాడు.