'టీమిండియాదే భవిష్యత్తు'

Future of India is bright, says Rohit sharma

నాగ్ పూర్: గత కొంతకాలంగా అన్ని విభాగాల్లో సత్తాచాటుతూ తిరుగులేని విజయాలు సాధిస్తున్న భారత క్రికెట్ జట్టుకు అమోఘమైన భవిష్యత్తు ఉందని ఓపెనర్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. మన రిజర్వ్ బెంచ్ ను చూస్తేనే భారత క్రికెట్ జట్టు భవిష్యతు ఎలా ఉండబోతుందనే విషయం అర్ధమవుతుందన్నాడు.

'మంచి రిజర్వ్ బెంచ్ మన సొంతం. ఎవరైతే జట్టులో దక్కించుకుంటున్నారో వారంతా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రతీ ఒక్కరూ ఆకట్టుకునే ప్రదర్శనను చేయడాన్ని ఛాలెంజ్ గా తీసుకుంటున్నారు. ఇందుకు ఐదో వన్డేనే ఉదాహరణ. ఇక్కడ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ కు విశ్రాంతినిచ్చారు. అదే సమయంలో తుది జట్టులో ఉన్న అక్షర్ పటేల్ సత్తా చాటుకున్నాడు. మరొకవైపు బ్యాటింగ్ లో అజింక్యా రహానే నిలకడగా స్కోర్లు రాబడుతున్నాడు. ఇవన్నీ భారత క్రికెట్ జట్టు భవిష్యత్తు ఎంత మెరుగ్గా ఉండబోతుందనే విషయాల్ని చెబుతున్నాయి. రాబోవు కాలం భారత క్రికెట్ జట్టుదే అనడంలో ఎటువంటి సందేహం లేదు'అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.

ఎప్పుడూ బౌలర్ల మైండ్ సెట్ వికెట్లను సాధించడంపైనే ఉంటుందని, అది ఆసీస్ తో సిరీస్ లో బాగా ఎక్కువ కనిపించదన్నాడు. ప్రతీ ఒక్కరు ఆశించిన స్థాయిలో రాణించడానికి యత్నించడం జట్టుకు శుభపరిణామంగా రోహిత్ స్పష్టం చేశాడు.

Back to Top