విశ్వ విజేతలకు ఘన స్వాగతం

France top honour for World Cup team - Sakshi

ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌ను గెలుచుకొని స్వదేశంలోకి అడుగు పెట్టిన ఫ్రాన్స్‌ జట్టుకు అపూర్వ రీతిలో ఘన స్వాగతం లభించింది. పారిస్‌లో జరిగిన విక్టరీ పరేడ్‌లో లక్షల సంఖ్యలో అభిమానులు గుమిగూడి తమ హీరోలకు జేజేలు పలికారు. ఓపెన్‌ టాప్‌ బస్సులో జట్టు సభ్యులంతా ట్రోఫీని ప్రదర్శిస్తూ తమ ఉత్సాహాన్ని ప్రదర్శించారు. సోమవారం సాయంత్రం దేశాధ్యక్షుడు మాక్రోన్‌ ఇచ్చిన ప్రత్యేక విందుకు ఆటగాళ్లు హాజరయ్యారు. వారిని అత్యున్నత పౌర పురస్కారం ‘లెజియన్‌ ఆఫ్‌ ఆనర్‌’తో త్వరలో సత్కరిస్తామని అధ్యక్షుడు ప్రకటించారు.    

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top