‘మా విజయం.. థాయ్‌ బాలలకు అంకితం’ | France Dedicates Semi final Win to Thai Cave Boys | Sakshi
Sakshi News home page

Jul 11 2018 2:41 PM | Updated on Jul 11 2018 3:32 PM

France Dedicates Semi final Win to Thai Cave Boys - Sakshi

థాయ్‌ గుహ నుంచి సురక్షితంగా బయటపడ్డ బాలురు

ఈ మా విజయం ఈ రోజు హీరోలుగా నిలిచిన బాలలకు అంకితం. వెల్‌డన్‌ బాయ్స్‌.. మీరెంతో దైర్యవంతులు..

సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌: థాయ్‌లాండ్‌లో గుహలో చిక్కుకున్న 13 మందిని రక్షించిన సహాయక బృందంపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. థాయలాండ్‌ ప్రభుత్వ కృషిని ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు. ఇక ఫిఫా ప్రపంచకప్‌ సెమీస్‌లో బెల్జియంపై 0-1 తేడాతో ఫ్రాన్స్‌ విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ విజయాన్ని గుహలో చిక్కుకున్న థాయ్‌ బాలలకు అంకితమిస్తున్నట్లు ఫ్రాన్స్‌ స్టార్‌ ఆటగాడు పాల్‌ పొగ్బా ప్రకటించాడు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో.. ‘మా విజయం ఈ రోజు హీరోలుగా నిలిచిన బాలలకు అంకితం. వెల్‌డన్‌ బాయ్స్‌.. మీరెంతో ధైర్యవంతులు’ అని పేర్కొంటూ ఆ బాలల ఫొటోలను ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెటిజన్లను తెగఆకట్టుకుంటోంది. పాల్‌పొగ్బాను ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు.

థాయ్‌లాండ్‌లో గుహలో చిక్కుకున్న చివరి ఐదుగురిని సహాయక బృందాలు మంగళవారం క్షేమంగా బయటకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 18 రోజుల నరకయాతన తర్వాత మొత్తం 13 మంది గుహ నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఓ ఫుట్‌బాల్‌ జట్టుకు చెందిన 12 మంది బాలురు, వారి కోచ్‌ జూన్‌ 23న థాయ్‌లాండ్‌లోని థామ్‌ లువాంగ్‌ గుహలోకి వెళ్లి, భారీ వర్షాల కారణంగా బయటకు వచ్చే దారి మొత్తం పూర్తిగా నిండిపోవడంతో, గుహలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement