ఐరన్‌ రాడ్లతో భారత మాజీ క్రికెటర్‌పై దాడి

Former India Cricketer Amit Bhandari Attacked, Admitted To Hospital - Sakshi

న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్‌, ఢిల్లీ, ఢిల్లీ డిస్ట్రిక్స్‌ అసోసియేషన్‌(డీడీసీఏ) సెలక్షన్‌ కమిటీ చీఫ్‌ అమిత్‌ భండారీపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. డీడీసీఏ అండర్‌-23 సెలక్షన్‌ జరుగుతున్న సమయంలో ఈ దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. న్యూఢిల్లీలోని స్టీఫెన్స్‌ గ‍్రౌండ్‌ వద్ద ఉన్న కశ్మేరా గేట్‌ ఏరియాలో దాడి జరిగినట్లు సహ సెలక్టర్‌ సుఖ్విందర్‌ సింగ్‌ తెలిపారు. అతనిపై ఐరన్‌ రాడ్లు, హాకీ స్టిక్‌లతో కొన్ని అల్లరి మూకలు దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో భండారీ తలకు, చెవికి తీవ్ర గాయాలైన భండారీని ఆస్పత‍్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఢిల్లీ అండర్-23 టీమ్‌ మేనేజర్‌ శంకర్ సైనీ కథనం ప్రకారం.. ‘టీమ్ ట్రయల్స్‌ని సెలక్టర్లతో కలిసి అమిత్ భండారీ పరిశీలిస్తుండగా.. నేను భోజనం కోసం అక్కడే ఏర్పాటు చేసిన టెంట్‌లోకి వెళ్లాను. ఆ తర్వాత కొద్దిసేపటికి ఇద్దరు వ్యక్తులు వచ్చి భండారీతో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ఆ ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ.. నిమిషాల వ్యవధిలోనే అనూహ్యాంగా సుమారు పదిహేను మంది హాకీ స్టిక్స్, రాడ్స్, సైకిల్ చైన్లతో వచ్చి భండారీపై దాడికి దిగారు. దీంతో.. అక్కడ ట్రయల్స్ కోసం వచ్చిన యువ క్రికెటర్లు ఆ మూకని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ.. అప్పటికే భండారీని తీవ్రంగా గాయపడ్డాడు’ అని సైనీ తెలిపారు. ఈ దాడి ఎవరు చేసారు అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top