
ఢాకా: తొలి మ్యాచ్‌లో జపాన్‌పై 5–1తో నెగ్గిన భారత హాకీ జట్టు అదే జోరులో మరో భారీ విజయంపై దృష్టి పెట్టింది. ఆసియా కప్‌లో భాగంగా శుక్రవారం జరిగే పూల్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడుతుంది. కొత్త కోచ్ మారిన్ జొయెర్డ్ ఆధ్వర్యంలో తొలి టోర్నీ ఆడుతోన్న భారత్ మొదటి మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చలాయించింది. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. సునీల్, లలిత్ ఉపాధ్యాయ్, రమణ్‌దీప్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్ మంచి సమన్వయంతో ఆడుతూ వరుస విరామాల్లో గోల్స్ చేశారు. అదే జోరును బంగ్లాదేశ్‌పై పునరావృతం చేస్తే మన ఖాతాలో మరో విజయం చేరడం ఖాయమే.