బోర్డు ప్రెసిడెంట్స్‌ జట్టులో మనోళ్లు ఐదుగురు | Five of the board members of the board are five | Sakshi
Sakshi News home page

బోర్డు ప్రెసిడెంట్స్‌ జట్టులో మనోళ్లు ఐదుగురు

Oct 24 2017 12:48 AM | Updated on Mar 10 2019 8:23 PM

Five of the board members of the board are five - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌ జట్టుకు ఏకంగా ఐదుగురు హైదరాబాద్‌ క్రికెట్‌ జట్టు ఆటగాళ్లు ఎంపికయ్యారు. ఆల్‌రౌండర్లు ఆకాశ్‌ భండారి, సీవీ మిలింద్‌ సహా పేస్‌ బౌలర్‌ రవికిరణ్, బ్యాట్స్‌మెన్‌ తన్మయ్‌ అగర్వాల్, బావనక సందీప్‌లకు 13 సభ్యులుగల బోర్డు జట్టులో తొలిసారిగా స్థానం లభించింది. మధ్యప్రదేశ్‌ వికెట్‌ కీపర్‌ నమన్‌ ఓజా ఈ జట్టుకు సారథ్యం వహిస్తాడు. ఈ జట్టు వచ్చే నెల 11, 12 తేదీల్లో శ్రీలంకతో కోల్‌కతాలో జరిగే రెండు రోజుల వార్మప్‌ మ్యాచ్‌లో తలపడుతుంది.

ప్రస్తుతం రంజీ ట్రోఫీ జరుగుతున్న నేపథ్యంలో లంకతో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ సమయంలో ఐదో రౌండ్‌ మ్యాచుల్లేని హైదరాబాద్, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్‌ ఆటగాళ్లను మాత్రమే బోర్డు ప్రెసిడెంట్స్‌ జట్టుకు ఎంపిక చేశారు. రంజీల నుంచి యువ ఆటగాళ్లను తప్పించవద్దనే జూనియర్‌ టీమిండియా కోచ్‌ ద్రవిడ్‌ సూచన మేరకే సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.  

జట్టు: నమన్‌ ఓజా (కెప్టెన్‌), బి. సందీప్, తన్మయ్‌ అగర్వాల్, ఆకాశ్‌ భండారి, రవికిరణ్, సీవీ మిలింద్, సంజూ శామ్సన్, జీవన్‌జ్యోత్‌ సింగ్, అభిషేక్‌ గుప్తా, రోహన్‌ ప్రేమ్, జలజ్‌ సక్సేనా, అవేశ్‌ ఖాన్, సందీప్‌ వారియర్‌.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement