భారత మహిళలకు తొలి గెలుపు  | First win for Indian womens | Sakshi
Sakshi News home page

భారత మహిళలకు తొలి గెలుపు 

Jun 17 2018 1:34 AM | Updated on Jun 17 2018 1:34 AM

First win for Indian womens - Sakshi

మాడ్రిడ్‌: స్పెయిన్‌తో జరుగుతోన్న సిరీస్‌లో కెప్టెన్‌ రాణి రాంపాల్‌ కీలక సమయంలో గోల్‌ చేయడంతో భారత మహిళల హాకీ జట్టు తొలి విజయాన్ని సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 1–1 తో సమంగా నిలిచింది. మూడో మ్యాచ్‌లో భారత్‌ 3–2తో స్పెయిన్‌పై గెలిచింది.

తొలి మ్యాచ్‌లో స్పెయిన్‌ గెలుపొందగా, రెండో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. మూడో మ్యాచ్‌లో భారత్‌ తరఫున గుర్జీత్‌ కౌర్‌ (28వ ని.లో), లాల్‌రెమ్‌సియామి (32వ ని.లో), రాణి రాంపాల్‌ (59వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు. స్పెయిన్‌ జట్టుకు మరియా లోపెజ్, లోలా రియ్‌రా ఒక్కో గోల్‌ అందించారు. ఈ మ్యాచ్‌తో భారత ఫార్వర్డ్‌ ప్లేయర్‌ వందన 200 అంతర్జాతీయ మ్యాచ్‌ల్ని పూర్తి చేసుకుంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement