టోక్యో ఒలింపిక్స్‌లో కొత్త టెక్నాలజీ

Facial Recognition Technology Introduce In Tokyo 2020 Olympics - Sakshi

టోక్యో : జపాన్‌ వేదికగా జరిగే 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ఫేషియల్‌ రికగ్నేషన్‌‌( ముఖాలను గుర్తు పట్టే) టెక్నాలజీని ప్రవేశ పెడుతున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఆటగాళ్ల భద్రతా పరిణామాలను మెరుగుపరిచేందుకు ఈ సాంకేతికను వాడనున్నట్లు స్పష్టం చేశారు. 2020 ఆగస్టు, జూలైలో జరిగే ఈ ఒలింపిక్స్‌ పోటీల్లో అథ్లెట్స్‌, ఆయా దేశాల సహాయక సిబ్బంది, మీడియా అధికారులతో కలిపి సుమారు మూడు లక్షల మంది పాల్గొననున్నట్లు వారు అంచనా వేస్తున్నారు. వీరందరీ ఫేషియల్‌ ఇమేజేస్‌ను డేటాబెస్‌లో స్టోర్‌ చేసి ఫేషియల్‌ రికగ్నైషన్‌ టెక్నాలజీతో వీరి ముఖాలను సరిపోల్చి ఆయా మ్యాచ్‌లకు అనుమతిస్తామని పేర్కొన్నారు. ఈ టెక్నాలజీకి కావల్సిన సాఫ్ట్‌వేర్‌ను ఎన్‌ఈసీ కార్పోరేషన్‌ రూపోందిస్తుందని టోక్యో సెక్యూరిటీ ఛీఫ్‌ మీడియాకు తెలిపారు. దీని సాయంతో అక్రమంగా ప్రవేశించే వారిని అడ్డుకోవచ్చని, నకిలీ ప్రత్రాలను, మోసగాళ్లను గుర్తించడం సులభమవుతుందని ఆయన అభిప్రాపడ్డారు.

ఎండలతో ఎఫెక్ట్‌.. మరి ఎలా
ప్రస్తుతం జపాన్‌లో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. వడగాలుల కారణంగా ఈ ఏడాది జులై నుంచి ఇప్పటివరకు 138 మంది చనిపోయారు. ఒలింపిక్స్ జరిగే సమయంలో ఎండలు, తేమ శాతం అత్యంత ప్రమాద స్థాయికి చేరే అవకాశం ఉంది. దీంతో నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లు మండే ఎండల బారిన పడకుండా చూసేందుకు తమ కాలాన్ని రెండు గంటలు ముందుకు జరపాలని జపాన్ ప్రభుత్వం ఆలోచిస్తోందని స్థానిక పత్రిక ఓ కథనం ప్రచురించింది. ఈ ప్రతిపాదనపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఒలింపిక్స్ అథ్లెట్లపై వేసవి ఎండల ప్రభావాన్ని తగ్గించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు పేర్కొంది.

అయితే కాలాన్ని ముందు జరిపే ప్రతిపాదనను జపాన్‌ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. దీనిని అమలు చేస్తే ఉద్యోగులు, కార్మికులు మరింత సమయం పనిచేయాల్సి వస్తుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇక నిర్వాకులు మాత్రం ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లకు ఎండ వేడి తగలకుండా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఇప్పటికే ఈవెంట్స్‌ జరిగే ప్రదేశాల్లో చెట్లు పెంచే కార్యక్రమం చేపట్టినట్లు స్పష్టం చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top