
‘గడువు తేదీని పొడిగించండి’
జస్టిస్ ఆర్‌ఎం లోధా ప్యానెల్ సూచించిన సంస్కరణల అమలుపై నివేదిక సమర్పించాలనే గడువును మార్చి 27 వరకు
న్యూఢిల్లీ: జస్టిస్ ఆర్‌ఎం లోధా ప్యానెల్ సూచించిన సంస్కరణల అమలుపై నివేదిక సమర్పించాలనే గడువును మార్చి 27 వరకు పొడిగించాలని బీసీసీఐ నూతన పరిపాలక కమిటీ (సీఓఏ)కి రాష్ట్ర క్రికెట్ సంఘాలు అభ్యర్థించాయి. మార్చి 1 వరకు నివేదిక ఇవ్వాలని ఆయా క్రికెట్ సంఘాలకు ఫిబ్రవరి 23న సీఓఏ లేఖలు రాసింది.
ఈ విషయంలో మరింత స్పష్టత అవసరమని అనర్హతకు గురైన 20 రాష్ట్ర క్రికెట్ సంఘాలకు చెందిన సభ్యులు వినోద్ రాయ్ నేతృత్వంలోని సీఓఏకు లేఖ రాశారు. అలాగే బోర్డు సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరి సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ విచారణ ఈనెల 27న జరగనున్న నేపథ్యంలో అప్పటి వరకు ఆగాలని కోరారు. రాష్ట్ర క్రికెట్, బీసీసీఐలో కలిపి పదవీ కాలం 9 ఏళ్లా లేక 18 ఏళ్లా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు.