ప్రతీ మ్యాచ్ ముఖ్యమైనదే.. | Every match is important .. | Sakshi
Sakshi News home page

ప్రతీ మ్యాచ్ ముఖ్యమైనదే..

Nov 25 2016 11:49 PM | Updated on Oct 2 2018 8:39 PM

ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్‌లో చెల్సీ జట్టుకు వెన్నెముక డేవిడ్ లూయిస్.

ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్‌లో చెల్సీ జట్టుకు వెన్నెముక డేవిడ్ లూరుుస్. తన అద్భుత ప్రదర్శనతో చెల్సీని ప్రస్తుతం పారుుంట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిపాడు. శనివారం టాటెన్‌హమ్, చెల్సీల మ్యాచ్ నేపథ్యంలో డేవిడ్ లూరుుజ్ ఇంటర్వ్యూ

మరోసారి చెల్సీ తరఫున ఆడుతుండడాన్ని ఆస్వాదిస్తున్నారా?
కచ్చితంగా.. తొలిసారి ఆడినప్పుడే జట్టును ఎంతగానో ఇష్టపడ్డాను. తిరిగి రావడం అద్భుతంగా అనిపిస్తుంది. మంచి ఆటతీరుతో అభిమానులను సంతృప్తి పరిచేందుకు కృషి చేస్తాను.

సొంత గడ్డపై టాటెన్‌హమ్‌తో జరిగే మ్యాచ్‌లో చెల్సీయే ఫేవరెట్‌గా ఉంది. దీనివల్ల ఒత్తిడి ఉంటుందా?
ప్రతీ మ్యాచ్ కఠినంగానే ఉంటుంది. దీనికి తగ్గట్టుగానే సిద్ధమవాలి. మ్యాచ్ ఫలితం ఎలా అరుునా రావచ్చు. ప్రీమియర్ లీగ్ అంత సులువు కాదు. మ్యాచ్ ఆరంభమైనప్పుడు ఎవరు గెలుస్తారో చెప్పలేరు. కానీ ప్రతీ మ్యాచ్‌లోనూ మా శాయశక్తులా ఆడేందుకు ప్రయత్నిస్తాం.

మీ జట్టు మేనేజర్ మారినప్పటి నుంచి చెల్సీ ఆటతీరులో చాలా మార్పు వచ్చింది. ముగ్గురు డిఫెండర్లతో మంచి ఫలితాలు రాబడుతున్నారు. టైటిల్ నెగ్గే విషయంలోనూ మీ ముగ్గురు కీలకమవుతారా?
జట్టు విజయంలో అందరి పాత్ర ఉంటుంది. కేవలం గోల్స్‌ను అడ్డుకునే డిఫెండర్లే కీలకమని చెప్పలేము. జట్టు మంచి సమతూకంతో ఉన్నప్పుడు ఫలితాన్ని ఆశించవచ్చు. జట్టులో ఎవరు ఆడుతున్నారనేది విషయం కాదు.

విక్టర్ మోజెస్ తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అతడు జట్టుకు ఎలా ఉపయోగపడుతున్నాడు?
మైదానంలో మేమంతా ఎలా ఆడాలో.. మా పాత్ర ఎలాంటిదో కోచ్ కోంట్ చాలా సమాచారం ఇచ్చారు. విక్టర్ ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకున్నాడు. బంతి తన అదుపులోకి వచ్చినప్పుడు ప్రత్యర్థిని తప్పిస్తూ అద్భుతాలు చేస్తున్నాడు. కచ్చితంగా తను జట్టులో కీలక ఆటగాడే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement