తొలి వన్డేలో ఇంగ్లండ్‌ గెలుపు | England win first ODI | Sakshi
Sakshi News home page

తొలి వన్డేలో ఇంగ్లండ్‌ గెలుపు

Mar 5 2017 1:17 AM | Updated on Sep 5 2017 5:12 AM

తొలి వన్డేలో ఇంగ్లండ్‌ గెలుపు

తొలి వన్డేలో ఇంగ్లండ్‌ గెలుపు

కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ (116 బంతుల్లో 107; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) ‘రికార్డు’ సెంచరీ సహాయంతో వెస్టిండీస్‌తో జరుగుతున్..

అంటిగ్వా: కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ (116 బంతుల్లో 107; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) ‘రికార్డు’ సెంచరీ సహాయంతో వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్‌ శుభారంభం చేసింది. శుక్రవారం రాత్రి జరిగిన తొలి వన్డేలో పర్యాటక జట్టు 45 పరుగుల తేడాతో గెలిచింది. నేడు (ఆదివారం) రెండో వన్డే జరుగుతుంది. ముందుగా ఇంగ్లండ్‌ 50 ఓవర్లలో 6 వికెట్లకు 296 పరుగులు చేసింది.

112 బంతుల్లో కెరీర్‌లో పదో సెంచరీ చేసిన మోర్గాన్‌.. ఇంగ్లండ్‌ కెప్టెన్‌గా అత్యధిక సెంచరీ (5)లు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. గతం లో స్ట్రాస్, కుక్‌ నాలుగేసి సెంచరీలతో ఉన్నారు. ఓపెనర్‌ బిల్లింగ్స్‌ (56 బంతుల్లో 52; 7 ఫోర్లు), స్టోక్స్‌ (61 బంతుల్లో 55; 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలు చేశారు. గాబ్రియెల్, నర్స్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత విండీస్‌ 47.2 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. వోక్స్, ప్లంకెట్‌ నాలుగేసి వికెట్లు తీశారు. 

Advertisement
 
Advertisement
Advertisement