స్మిత్‌ లేని ఆస్ట్రేలియా | England focused despite Smith's withdrawal from third Ashes Test | Sakshi
Sakshi News home page

స్మిత్‌ లేని ఆస్ట్రేలియా

Aug 22 2019 4:55 AM | Updated on Aug 22 2019 4:55 AM

England focused despite Smith's withdrawal from third Ashes Test - Sakshi

లీడ్స్‌: తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలతో ఆస్ట్రేలియా జట్టును గెలిపించిన మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. అయితే జోఫ్రా ఆర్చర్‌ దెబ్బ అతడిని ఆటకు దూరం చేసింది. గాయం నుంచి కోలుకోకపోవడంతో మూడో టెస్టు నుంచి కూడా తప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఫామ్‌లో లేని మిగిలిన ఆటగాళ్లను చుట్టేసి సిరీస్‌ సమం చేయాలని ఇంగ్లండ్‌ ఆశపడుతోంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి మూడో యాషెస్‌ టెస్టుకు రంగం సిద్ధమైంది.  మరోవైపు ఇంగ్లండ్‌ కెప్టెన్‌ రూట్‌ బ్యాటింగ్‌ పూర్తిగా గతి తప్పడం జట్టును ఇబ్బందుల్లో పడేస్తోంది. ఇక బౌలింగ్‌లో గత మ్యాచ్‌లో భీకరమైన వేగంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించిన ఆర్చర్‌ ఈసారి అదే తరహాలో చెలరేగిపోతే ఆసీస్‌కు కష్టాలు తప్పవు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement