డ్వేన్‌ బ్రేవో షాకింగ్‌ నిర్ణయం

Dwayne Bravo retires from international cricket - Sakshi

ఆంటిగ్వా:  వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. 35 ఏళ్ల బ్రావో 2016 సెప్టెంబర్లో చివరిసారిగా విండీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2012, 2016 టీ20 వరల్డ్ కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన బ్రేవో.. 270 మ్యాచ్‌ల్లో విండీస్ తరఫున బరిలో దిగాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్ల నుంచి అధికారికంగా తప్పుకుంటున్నట్టు బ్రేవో బుధవారం రాత్రి ప‍్రకటించాడు.

‘14 ఏళ్ల క్రితం వెస్టిండీస్ తరఫున అరంగేట్రం చేశాను. నాకు ఇప్పటికీ ఆ క్షణాలు గుర్తున్నాయి. 2004లో ఇంగ్లండ్‌పై తొలి మ్యాచ్ ఆడటానికి లార్డ్స్‌లోకి అడుగుపెట్టే ముందు మెరూన్ క్యాప్ అందుకున్నాను. సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడాను. తర్వాతి తరం క్రికెటర్లకు అవకాశం ఇవ్వడం కోసం రిటైర్ అవుతున్నా’ అని బ్రేవో తన ప‍్రకటనలో స్పష్టం చేశాడు. అయితే క్రికెటర్‌గా ప్రొఫెషనల్‌ కెరీర్‌ను కొనసాగిస్తానని బ్రేవో తెలిపాడు. దాంతో ఐపీఎల్‌ వంటి లీగ్‌ల్లో ఆడతానని బ్రేవో చెప్పకనే చెప్పేశాడు.

40 టెస్టులు ఆడిన బ్రావో 31.43 సగటుతో 2200 పరుగులు చేయడంతోపాటు 86 వికెట్లు తీశాడు. 164 వన్డేలు ఆడిన ఈ కరేబియన్ ప్లేయర్ 2968 రన్స్ చేయడంతోపాటు 199 వికెట్లు పడగొట్టాడు. 66 టీ20ల్లో 1142 పరుగులు చేసి, 52 వికెట్లు తీశాడు. చివరిసారిగా 2010లో శ్రీలంకపై చివరి టెస్ట్ ఆడాడు. 2014లో భారత్‌పై ఆఖరి వన్డే ఆడిన బ్రావో.. 2016లో పాక్‌పై చివరి టీ20 మ్యాచ్ ఆడాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top