19న డు ప్లెసిస్ విచారణ | Du Plessis's appeal hearing against ICC verdict on December 19 | Sakshi
Sakshi News home page

19న డు ప్లెసిస్ విచారణ

Dec 7 2016 2:23 AM | Updated on Sep 4 2017 10:04 PM

బాల్ టాంపరింగ్ ఆరోపణలపై దక్షిణాఫ్రికా జట్టు బ్యాట్స్‌మన్ డు ప్లెసిస్ చేసుకున్న అప్పీల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)

 దుబాయ్: బాల్ టాంపరింగ్ ఆరోపణలపై దక్షిణాఫ్రికా జట్టు బ్యాట్స్‌మన్ డు ప్లెసిస్ చేసుకున్న అప్పీల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఈనెల 19న విచారించనుంది. జ్యుడీషియల్ కమిషనర్ మైకేల్ బెలాఫ్ అతడి వాదనలు వింటారని ఐసీసీ పేర్కొంది. ఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ విచారణ జరుగుతుంది. ఐసీసీతో పాటు దక్షిణాఫ్రికా క్రికెట్‌కు చెందిన లీగల్ కౌన్సిల్‌లు కూడా ఇందులో పాల్గొంటారు. డు ప్లెసిస్ స్వయంగా హాజరుకాకుండా టెలిఫోన్ లింక్ ద్వారా అందుబాటులో ఉంటాడని ఐసీసీ తెలిపింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement