
న్యూఢిల్లీ: ఆసియా కప్ షెడ్యూల్‌పై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మండిపడ్డాడు. టీమిండియా వరుసగా రెండు రోజులు వన్డేలు ఆడాల్సి ఉండటాన్ని చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని అతడు పేర్కొన్నాడు. అసలు భారత్ ఈ టోర్నీలో పాల్గొనా ల్సిన అవసరమే లేదని... ఆ సమయంలో మరేదైనా టోర్నీ ఆడొచ్చని సూచించాడు.
‘ఈ రోజుల్లో ఏ జట్టు వరుసగా రెండు వన్డేలు ఆడుతోంది? ఇంగ్లండ్‌తో ఇటీవల టి20 మ్యాచ్‌లను కూడా రెండు రోజుల విరామంతో నిర్వహించారు. అలాంటిది వేడి వాతావరణం ఉండే దుబాయ్‌లో విరామం లేకుండా వన్డే మ్యాచ్‌లా? పూర్తిగా అసాధ్యం. నా దృష్టిలో ఇది సరైన షెడ్యూల్ కాదు’ అని నిష్కర్షగా వ్యాఖ్యానించాడు.