ప్రాణంపోసే వైద్య వృత్తి ఉత్తమమైనదని లోకాయుక్త చైర్మన్ జస్టిస్ బి.సుభాషణ్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఈసీఐఎల్ గ్రౌండ్స్‌లో జరిగిన డాక్టర్స్ క్రికెట్ లీగ్ (డీసీఎల్) ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కుషాయిగూడ, న్యూస్‌లైన్: ప్రాణంపోసే వైద్య వృత్తి ఉత్తమమైనదని లోకాయుక్త చైర్మన్ జస్టిస్ బి.సుభాషణ్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఈసీఐఎల్ గ్రౌండ్స్‌లో జరిగిన డాక్టర్స్ క్రికెట్ లీగ్ (డీసీఎల్) ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో విశేష ఆదరణ ఉన్న క్రికెట్‌లో సినీ యాక్టర్లు పాల్గొనడం పాతబడుతున్న తరుణంలో డాక్టర్స్ క్రికెట్ లీగ్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కిమ్స్, స్టార్, గ్లోబల్, అపోలో, ఆలివ్, యశోద ఆసుపత్రులకు చెందిన వైద్యులు మొత్తం ఎనిమిది జట్లుగా పాల్గొన్న ఈ డాక్టర్స్ క్రికెట్ లీగ్ కప్‌ను యశోద ఆసుపత్రి జట్టు గెలుచుకుంది.
ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో కిమ్స్ జట్టుపై యశోద (సికింద్రాబాద్) మూడు పరుగుల తేడాతో విజయం సాధించి ట్రోఫీతో పాటు లక్ష రూపాయల నగదు బహుమతి గెలుచుకుంది. ఘాన్సీబజార్ కార్పొరేటర్ రంజనాదేవి గోయెల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్‌మెన్ అవార్డులను అందజేశారు. మైటీ స్పోర్ట్స్ అండ్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్, ప్రొఫెసర్ జాకీర్ హుస్సేన్, డాక్టర్ రీటాశుక్లా, ఈవెంట్ ప్రతినిధులు నంద పాండే, నిఖిల్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.