ధోనికి చేదు అనుభవం, రెచ్చిపోయిన కశ్మీర్‌ యువత | Dhoni Welcomed to J&K Stadium With 'Boom Boom Afridi' Chants | Sakshi
Sakshi News home page

ధోనికి చేదు అనుభవం, రెచ్చిపోయిన కశ్మీర్‌ యువత

Nov 28 2017 6:01 PM | Updated on Dec 7 2017 5:50 PM

Dhoni Welcomed to J&K Stadium With 'Boom Boom Afridi' Chants - Sakshi

జమ్ము కశ్మీర్‌లో ఏర్పాటువాదులు రెచ్చిపోయారు. భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని పర్యటనలో వ్యతిరేక నినాదాలతో గొంతు చించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే జమ్ము కశ్మీర్‌ పర్యటనకు వెళ్లిన ధోనికి చేదు అనుభవం ఎదురైంది. స్థానిక యువతను ప్రోత్సహిస్తూ భారత సైన్యం ప్రత్యేక క్రికెట్‌ టోర్నమెంట్‌ ఏర్పాటు చేసింది. ధోని ఒక ఆర్మీ అధికారిగా టోర్నమెంట్‌ను సందర్శించడానికి ధోని వెళ్లారు. అంతే కాకుండా అక్కడి క్రికెటర్లతో చాలాసేపు చర్చించారు. భవిష్యత్తులో రాష్ట్రం నుంచి భారత్‌ తరపున ఆడాలంటూ ప్రోత్సహించారు.

అయితే ఈపర్యటనలో అనుకోని విధంగా ధోనికి చేదు అనుభవం ఎదురైంది. ధోని వచ్చే సమయంలో కొంత మంది వేర్పాటువాద యువకులు రెచ్చిపోయారు. పాకిస్తాన్‌ ఆటగాడు ఆఫ్రిదికి అనుకూలంగా 'భూమ్‌ భూమ్‌ ఆఫ్రిది' అంటూ నినాదాలు అందుకున్నారు. దీనిపై స్పందించిన అధికారులు వారిని అడ్డుకొన్నారు. అయితే ఈ వివాదంలో ఎవరికీ ఏమీ కాలేదు. ఇప్పుడు ఈవీడియో వైరల్‌ అయింది.

ఇప్పటికే రెండు దేశాల మధ్య చాలా కాలంగా ద్వైపాక్షిక మ్యాచ్‌లు జరగడంలేదు. ఐసీసీ నిర్వహించే టోర్నమెంట్లలో తప్ప ప్రత్యేకంగా సిరీస్‌లు ఆడింది లేదు. అయినా రెండు దేశాల ఆటగాళ్ల మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. పలు సందర్భాల్లో ఈ విషయం వెల్లడైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement