వారెవ్వా ధోని.. | Dhoni takes Another Best Catch | Sakshi
Sakshi News home page

వారెవ్వా ధోని..

Oct 27 2018 2:21 PM | Updated on Oct 27 2018 2:31 PM

Dhoni takes Another Best Catch - Sakshi

పుణె: వెస్టిండీస్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిని పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం ప్రకటించిన జట్టులో ధోనికి ఉద్వాసన పలికారు సెలక్టర్లు. ధోని ఫామ్‌ తగ్గిందని భావించారో.. ప్రయోగంలో భాగంగానే అతన్ని తప్పించారో తెలియదు కానీ మొత్తంగా వేటు మాత్రం పడింది. దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ధోని ఫ్యాన్స్‌.
 

కాగా, విండీస్‌తో ఇక్కడ జరుగుతున‍్న మూడో వన్డేలో ధోని ఔరా అనిపించాడు. భారత జట్టులో వికెట్‌ కీపర్‌గా సైతం తనదైన మార్కు వేసిన ధోని.. ఒక అ‍ద్భుతమైన క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్‌లో భారత జట్టు టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్‌ చేపట్టిన విండీస్‌ ఆరో ఓవర్‌లో తొలి వికెట్‌ను కోల్పోయింది. బూమ్రా వేసిన ఆ ఓవర్‌ ఐదో బంతిని విండీస్‌ ఓపెనర్‌ హెమ్రాజ్‌ బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌ లెగ్‌ బౌండరీ కొట్టే యత్నం చేశాడు. టాప్‌ ఎడ్జ్‌ తీసుకున్న ఆ బంతిని పట్టుకునే క్రమంలో ధోని పరుగుత్తుకుంటూ వెళ్లడమే కాకుండా డైవ్‌ కొట్టి మరీ క్యాచ్‌ అందుకున్నాడు. అప్పటికే వరుస బంతుల్లో ఫోర్‌, సిక్స్‌ కొట్టి మంచి ఊపు మీదు ఉన్న హెమ్రాజ్‌కు సైతం ధోని క్యాచ్‌ను అందుకున్న తీరు చూసి ఆశ‍్చర్యపోయాడు. ఇది చూసిన క్రికెట్‌ అభిమానులు సైతం వారెవ్వా ధోని అనుకుంటున్నారు.ఇది కచ్చితంగా ధోని పట్టిన బెస్ట్‌ క్యాచ్‌ల్లో ఒకటిగా నిలుస్తుందని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement