
కంగనాతో ధోనీ, కోహ్లీ ఏం చేశారు?
కంగనా రనౌత్తో కలిసి ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, అశ్విన్ హల్ చల్ చేశారు. ఓ ఫోన్ యాడ్ కోసం అదిరిపోయేలా నటించారు.
ముంబయి: క్రికెటర్లుగానే కాదు తాము కూడా అద్భుతంగా నటించగలమని ఇండియన్ క్రికెటర్లు ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, అశ్విన్. వారు నటించింది కూడా ఇప్పుడు బాలీవుడ్ లో టాప్ సీడ్ లో దూసుకుపోతున్న కంగనా రనౌత్తో. అవును ఓ మొబైల్ ఫోన్ ప్రచారం కోసం తీసిన వాణిజ్య ప్రకటనలో వీరంతా కలిసి నటించి హల్ చల్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు ఆన్ లైన్ లో వీర విహారం చేస్తూ వైరల్ గా మారింది. ఈ యాడ్లో ఏం ఉందంటే అశ్విన్ ఓ స్మార్ట్ ఫోన్ లో కంగనా రనౌత్ వీడియో చూస్తుంటాడు. అదే సమయానికి ధోని, విరాట్ కోహ్లీ గోడ చాటునుంచి అశ్విన్ను చూస్తుంటారు.
అప్పుడే కంగనా రాగా ఆమెను అక్కడే చాటుగా ఉంచి అశ్విన్ వద్దకు వెళతారు. మళ్లీ కంగనానే చూస్తున్నావా అని అతడిని ప్రశ్నిస్తారు. దానికి అశ్విన్ బదులిస్తూ ఇదేం ఫోన్ చెత్తగా ఉంది.. ఇందులో పిక్చర్ క్వాలిటీ లేదని విసుక్కుంటాడు. అప్పుడు లైఫ్ అనే స్మార్ట్ ఫోన్ వారు చేతికి అందించి ఇందులో చూడు కంగనాను చూడు.. పిక్చర్ క్వాలిటీ అదిరిపోద్దీ.. ఒక్కసారి స్క్రీన్ టచ్ చేస్తే కంగానా నీ ముందుకు వచ్చినట్లే ఉంటుంది అని చేతికి ఇస్తారు. అశ్విన్ స్క్రీన్ టచ్ చేయగానే అప్పటికే గోడ చాటున దాక్కున్న కంగనా వచ్చి వారి ముందు డాన్స్ చేస్తుంది. అలా అందరూ కలిసి లైఫ్ స్మార్ట్ ఫోన్ కోసం దుమ్మురేపే డ్యాన్స్ తో ప్రచారం కల్పిస్తారు.