ధావన్ కు తప్పని విశ్రాంతి | Dhawan left out of Indian squad for last two one days against australia | Sakshi
Sakshi News home page

ధావన్ కు తప్పని విశ్రాంతి

Sep 25 2017 4:09 PM | Updated on Sep 25 2017 4:31 PM

Dhawan left out of Indian squad for last two one days against australia

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా జరుగుతున్న ద్వైపాక్షిక వన్డే సిరీస్ లో భాగంగా చివరి వన్డేలకు సైతం భారత ఓపెనర్ శిఖర్ ధావన్ కు విశ్రాంతినిచ్చారు.  భార్య అనారోగ్యం కారణంగా తొలి మూడు వన్డేలకు దూరమైన ధావన్.. చివరి రెండు వన్డేల్లో కూడా అందుబాటులో లేడు. ఈ మేరకు ఆఖరి రెండు వన్డేలకు  15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అయితే ఇక్కడ ధావన్ కు విశ్రాంతినివ్వగా, ఆఖరి రెండు వన్డేలకు అక్షర్ పటేల్ ఎంపికయ్యాడు. రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్ తిరిగి జట్టుతో కలిశాడు. గత మూడు వన్డేలకు రవీంద్ర జడేజా జట్టులో లేకపోయినప్పటికీ, గాయపడిన అక్షర్ కు బ్యాకప్ గా జడేజా జట్టులో కొనసాగాడు.


చివరి రెండు వన్డేలకు భారత జట్టు:విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మనీష్ పాండే, కేదర్ జాదవ్, అజింక్యా రహానే, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, బూమ్రా, భువనేశ్వర్ కుమార్,  ఉమేశ్ యాద్, మొహ్మద్ షమీ, అక్షర్ పటేల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement