‘బోరింగ్‌ మెడిటేషన్‌’లో ఏబీ ఏం చేశాడో తెలుసా?

De Villiers' Boring Meditation Routine, Hit His Wife By Ball - Sakshi

ఆ వీడియోను దొంగిలించా..

కేప్‌టౌన్‌: ప్రస్తుతం దాదాపు ప్రపంచ మొత్తాన్ని ఇంటికే  పరిమితం చేసింది ఎవరైనా ఉన్నారంటే అది కనిపించని కరోనా వైరస్‌ది. ఈ వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తమ రెగ్యులర్‌ కార్యక్రమాలను పక్కన పెట్టి మరీ ఇంటి జీవితాన్ని గడుపుతున్నారంతా. ఇక ఇక్కడ క్రికెటర్లైతే మరీ బోర్‌ ఫీలవుతున్నారు. లాక్‌డౌన్‌ ప్రభావంతో మొత్తం క్రికెట్‌ టోర్నీలన్నీ రద్దు కావడంతో క్రికెటర్లు కనీసం ప్రాక్టీస్‌ చేసుకునే వీలుకూడా లేకుండా పోయింది. ఇంట్లో కాలక్షేపం​ తప్పితే పెద్దగా చేసే పనేమీ వారికి కనబడుటం లేదు.

‘ముంబైలో నేను ఉండే ఫ్లాట్‌ 54 అంతస్తుల భవనంలో ఉంది. ప్రభుత్వ ఆదేశాలతో ఇందులో ఉండే అధునాతన జిమ్‌లను మూసివేశారు. నేను అనుకున్నా సరే, బయటకు వెళ్లే అవకాశం లేదు. ఏదో నాలుగు అంతస్తులు అలా పైకి, కిందకి పరుగెత్తడం మినహా మరో మార్గం కనిపించడం లేదు. గాయం నుంచి కోలుకుంటున్న సమయంలో మరింత మెరుగైన ఫిట్‌నెస్‌ ప్రణాళిక అమలు చేసి ఉంటే బాగుండేది’ అని ఇప‍్పటికే రోహిత్‌ బోర్‌ ఫీలవుతుండగా, దక్షిణాఫ్రికా క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ ఇదే బాటలో పయనిస్తున్నాడు. ఇంట్లోని ఫ్లోర్‌ మీద వెల్లకిలా పడుకుని బోరింగ్‌ ధ్యానం చేశాడు. అదే సమయంలో బంతిని తీసుకుని సీలింగ్‌ కొడుతూ క్యాచింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. ఈ వీడియోను తన భార్య తీస్తుండగా డివిలియర్స్‌  తదేకంగా సీలింగ్‌ కొడుతూ,  తిరిగి వచ్చిన బంతిని క్యాచ్‌లు అందుకుంటూ తన ముచ్చట తీర్చుకున్నాడు.

అయితే చివరగా ఆ బంతితోనే వీడియో తీస్తున్న భార్యను కొట్టాడు ఏబీ. క్యాచింగ్‌ ప్రాక్టీస్‌ చేసే క్రమంలో బంతిని పట్టుకుని భార్యపైకి విసిరాడు. ఈ ఆశ్చర్యకర పరిణామానికి డివిలియర్స్‌ భార్య ఒక్కసారిగా కంగారు పడింది. ఈ వీడియో తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు ఏబీ. అయితే ఆ వీడియోను తన భార్య నుండి దొంగిలించానని డివిలియర్స్‌ పేర్కొన్నాడు. ‘నాకు చిన్నతనం నుంచి ఇలా చేయడం అలవాటు. నేను దీన్ని గంటలు తరబడి చేయగలను. నేను అదే పనిలో ఉండగా నన్ను వీడియో తీసింది. ఈ వీడియో క్రెడిట్‌ అంతా నా భార్యదే. కానీ దాన్ని దొంగిలించి నేను కూడా సర్‌ప్రైజ్‌ ఇచ్చా’ అని డివిలియర్స్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో రాసుకొచ్చాడు.

తన రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న డివిలియర్స్‌.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) ద్వారా గాడిలో పడాలని భావించాడు. ఇప్పుడేమే ఆ లీగ్‌ సైతం వాయిదా పడింది. ఏప్రిల్‌ 15వ తేదీ వరకు ఐపీఎల్‌ను వాయిదా వేసినా అటు తర్వాత కూడా ఆ క్యాష్‌ రిచ్‌ లీగ్‌  జరుగుతుందని గ్యారంటీ లేదు. 2018లో  మే నెలలో డివిలియర్స​ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పేశాడు. కాగా, గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో ఏబీ  ఆడాలని చూసినా అది జరగలేదు. వన్డే వరల్డ్‌కప్‌లో సఫారీలు ఘోర ప్రదర్శన  తర్వాత మళ్లీ డివిలియర్స్‌ పేరు వినిపించింది. ఆ క్రమంలోనే డివిలియర్స్‌ పునరాగమనం కోసం దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు ప్రయత్నాలు చేయగా అందుకు అతను ఒప్పుకున్నాడు. ఇక అతని అంతర్జాతీయ రీఎంట్రీనే మిగిలి ఉంది. (చదవండి: విరామం మంచిదేనా!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top