'యాషెస్ ను బాయ్ కాట్ చేయరు' | Darren Lehmann hopes no Ashes boycott | Sakshi
Sakshi News home page

'యాషెస్ ను బాయ్ కాట్ చేయరు'

May 18 2017 10:00 PM | Updated on Sep 5 2017 11:27 AM

'యాషెస్ ను బాయ్ కాట్ చేయరు'

'యాషెస్ ను బాయ్ కాట్ చేయరు'

క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)కు ఆటగాళ్లకు నెలకొన్న కొత్త కాంట్రాక్ట్ వివాదంతో యాషెస్ సిరీస్ కు ఎటువంటి ముప్పు ఉండదనే తాను అనుకుంటున్నట్లు ఆ దేశ కోచ్ డారెన్ లీమన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

సిడ్నీ: క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)కు ఆటగాళ్లకు నెలకొన్న కొత్త కాంట్రాక్ట్ వివాదంతో యాషెస్ సిరీస్ కు ఎటువంటి ముప్పు ఉండదనే తాను అనుకుంటున్నట్లు ఆ దేశ కోచ్ డారెన్ లీమన్ అభిప్రాయపడ్డాడు. ఆ సిరీస్ ను ఆసీస్ ఆటగాళ్లు బాయ్ కాట్ చేయరనే అనుకుంటున్నట్లు లీమన్ పేర్కొన్నాడు. త్వరలోనే బోర్డుకు క్రికెటర్లకు మధ్య చోటు చేసుకున్న వివాదానికి పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు.


'యాషెస్ సిరీస్ జరుగుతుందని నేను కచ్చితంగా చెబుతున్నాను. ఆసీస్ క్రికెట్ లో ప్రస్తుతం ఏమి జరుగుతున్నా నా దృష్టిలో చూస్తే అది పెద్ద సమస్యే కాదు. నేను ఆటగాళ్లతో  బోర్డుతో మాట్లాడుతూనే ఉన్నా. అంత సర్దుకుంటుందనే భావిస్తున్నా. ఇందుకు పరిష్కారం వెతకమని ఆసీస్ క్రికెట్ బోర్డుకు విజ్ఞప్తి చేశా' అని లీమన్ తెలిపాడు.

Advertisement
 
Advertisement
Advertisement