ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌పై నిషేధం.. కారణం ఇదే..! | Australia Megan Schutt Suspended Over Prescription Medication Breach, To Miss New Zealand T20 And WBBL Clash | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌పై నిషేధం.. కారణం ఇదే..!

Oct 22 2026 11:47 AM | Updated on Oct 22 2026 12:18 PM

Megan Schutt Suspended Over Prescription Medication Breach

source: X

ఆస్ట్రేలియా స్టార్‌ ఫాస్ట్‌ బౌలర్‌ మెగన్‌ షట్‌పై క్రికెట్‌ ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది. ప్రిస్క్రిప్షన్‌ మందుల వినియోగానికి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించడంతో ఈ చర్య తీసుకుంది. ఈ ఘటన పోటీలకు వెలుపల జరిగిందని, పనితీరును మెరుగుపరుచుకునేందుకు మందులు వాడలేదని క్రికెట్‌ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది.

ఈ నిషేధంతో షట్‌ న్యూజిలాండ్‌తో జరిగే చివరి టీ20తో పాటు, అక్టోబర్‌ 31న అడిలైడ్‌ స్ట్రైకర్స్‌, మెల్‌బోర్న్‌ స్టార్స్‌ మధ్య జరగనున్న డబ్ల్యూబీబీఎల్‌ మ్యాచ్‌కు దూరం కానుంది.

తన తప్పును అంగీకరించిన షట్‌.. నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు క్షమాపణలు చెప్పింది. ఐదుసార్లు ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన ఆమె, ఆస్ట్రేలియా తరఫున వన్డేల్లో ఇప్పటివరకు 158 వికెట్లు పడగొట్టింది. ఆ జట్టు తరఫున అత్యధిక వన్డే వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఎలిస్‌ పెర్రీ (167), క్యాథరిన్‌ ఫిట్జ్‌పాట్రిక్‌ (180) తర్వాతి స్థానంలో ఉంది.

ఇదీ చదవండి: మరోసారి చెలరేగిన రషీద్‌ ఖాన్‌.. బంగ్లాను ఇంటికి పంపిన ఆఫ్ఘనిస్తాన్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement