breaking news
Megan Schutt
-
చరిత్ర సృష్టించిన టీమిండియా బౌలర్.. సరికొత్త రికార్డు
భారత యువ లెఫ్టార్మ్ స్పిన్నర్ శ్రీ చరణి అంతర్జాతీయ టీ20 క్రికెట్లో సరికొత్త మైలురాయిని అందుకుంది. తాజాగా విడుదలైన ఐసీసీ మహిళల టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఆమె 817 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఈ క్రమంలో శ్రీ చరణి ఓ సరికొత్త రికార్డు నెలకొల్పింది.బౌలర్ల టీ20 ర్యాంకింగ్స్ చరిత్రలో అత్యధిక రేటింగ్ పాయింట్లు (817) సాధించిన బౌలర్‌గా నిలిచింది. ఈ క్రమంలో ఆసీస్ పేసర్ మెగాన్ షట్ (806) రికార్డును బద్దలు కొట్టింది. శ్రీ చరణి షట్ కంటే 11 పాయింట్లు ఎక్కువగా సాధించింది. ఏషియన్ గేమ్స్‌లో అద్భుతంగా రాణించడంతో శ్రీ చరణి రేటింగ్ పాయింట్లు పెరిగాయి. ఏషియన్ గేమ్స్‌లో భారత్ స్వర్ణం గెలవడంలోనూ ఆమె కీలకపాత్ర పోషించింది.టాప్-5లోకి మంధానమరోవైపు భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగుపరుచుకుని టాప్-5లోకి ప్రవేశించింది. ఏషియన్ గేమ్స్ ఫైనల్లో శ్రీలంకపై ఆడిన మెరుపు ఇన్నింగ్స్ (46 బంతుల్లో 79 పరుగులు) ఆమెను టాప్-5లోకి ప్రవేశించేలా చేసింది. మంధాన కూడా ఏషియన్ గేమ్స్‌లో భారత్ స్వర్ణం సాధించడంలో కీలకంగా వ్యవహరించింది.భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ కూడా ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు మెరుగుపరుచుకుంది. శ్రీలంకతో ఫైనల్లో 22 బంతుల్లో అజేయంగా 49 పరుగులు చేసిన ఆమె తాజా ర్యాంకింగ్స్‌లో 25వ స్థానానికి చేరుకుంది.పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్లేయర్ల పురోగతిబ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా నాలుగు స్థానాలు ఎగబాకి 23వ స్థానానికి చేరుకుంది. బంగ్లాదేశ్ బ్యాటర్ షర్మిన్ అక్తర్ 10 స్థానాలు మెరుగుపరుచుకుని 35వ స్థానంలో నిలిచింది.బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో పాక్ లెఫ్టార్మ్ స్పిన్నర్ నష్రా సంధు తిరిగి టాప్-10లోకి వచ్చింది. బంగ్లాదేశ్ స్పిన్నర్ నహిదా అక్తర్, పాకిస్థాన్ ఉమ్-ఎ-హానీ, భారత్‌కు చెందిన క్రాంతి గౌడ్ కూడా తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు.హేలీ మాథ్యూస్ జోరుబ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో వెస్టిండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ మూడు స్థానాలు మెరుగుపరుచుకుని నాలుగో స్థానానికి చేరుకుంది. జింబాబ్వేతో జరిగిన ఐసీసీ వుమెన్స్ ఛాంపియన్షిప్ సిరీస్‌లో మాథ్యూస్ ఓ మ్యాచ్‌లో 182 పరుగులు చేసింది. ఇది వెస్టిండీస్ మహిళా క్రికెటర్ నమోదు చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా నిలిచింది.ఇదీ చదవండి: పరువు కాపాడుకునే మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బలు -
మెగాటోర్నీకి ముందు ఆసీస్ స్టార్ షాకింగ్ నిర్ణయం!
ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మేగన్ స్కట్ రిటైర్మెంట్పై కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ముగిసిన అనంతరం ఆటకు వీడ్కోలు పలకనున్నట్లు మేగన్ స్కట్ వెల్లడించింది. తర్వాతి జనరేషన్‌కు అవకాశాలు ఇవ్వా లనే ఉద్దేశంతోనే రిటైర్మెంట్ తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఆమె తెలిపింది.దీంతో మహిళల టీ20 ప్రపంచకప్ మేఘన్ స్కట్‌కు చివరి అంతర్జాతీయ టోర్నీ కానుంది. 33 ఏళ్ల మేగన్ స్కట్ 2012లో 20 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది. అనతికాలంలోనే ఆసీస్ స్టార్ ప్లేయర్‌గా పేరు పొందిన మేగన్ స్కట్ ఆ జట్టు తరఫున నాలుగు టెస్టులు, 111 వన్డేలు, 125 టీ20 మ్యాచ్‌లు ఆడింది. మొత్తం 240 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన మేగన్ స్కట్ 309 వికెట్లు పడగొట్టింది. ఇందులో వన్డేల్లో 148 వికెట్లు, టీ20ల్లో 152 వికెట్లు ఉన్నాయి. మహిళల క్రికెట్ చరిత్రలో వన్డేల్లో అత్యంత వేగంగా వంద వికెట్లు పూర్తి చేసిన రెండో బౌలర్‌గానూ రికార్డులకెక్కింది. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మేగన్ అగ్రస్థానంలో ఉంది. అంతేకాదు అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్లో హ్యాట్రిక్ సాధించిన మొదటి బౌలర్‌గానూ మేగన్ రికార్డులకెక్కింది.ఇక తన రిటైర్మెంట్ ప్లాన్‌పై మేగన్ స్కట్ స్పందించింది. ‘14 ఏళ్ల కెరీర్ నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. తర్వాతి తరానికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయిం చుకున్నా. ఐసీసీ టీ20 ప్రపంచకప్ నాకు చివరి టోర్నీ కానుంది.’ అని చెప్పుకొచ్చింది. మేగన్ స్కట్.. రెండు వన్డే ప్రపంచకప్(2013, 2022)లతో పాటు మూడు టీ20 ప్రపంచకప్‌లు (2108, 2020, 2026) గెలిచిన ఆసీస్ జట్టులో సభ్యురాలిగా ఉంది. జూన్ 12న ప్రారంభం కానున్న మెగా టోర్నీలో ఆస్ట్రేలియా జట్టు తమ తొలి మ్యాచ్‌ను జూన్ 13న సౌతాఫ్రికాతో ఆడనుంది.లెస్బియన్‌తో వివాహంఅడిలైడ్కు చెందిన మేఘన్ స్కట్ తన దీర్ఘకాల భాగస్వామి జెస్ హోలియోక్ను వివాహం చేసుకుంది. ఆస్ట్రేలియాలో స్వలింగ వివాహాలు చట్టబద్ధం అయిన తర్వాత 2019లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. 2021 ఆగస్టులో, అత్యవసర సి-సెక్షన్ సరోగసి ద్వారా నెలలు నిండని బిడ్డకు జన్మనిచ్చారు. ఆ బిడ్డకు రైలీ లూయిస్ అని పేరు పెట్టారు. అయితే 2025లో జెస్తో తన పదేళ్ల రిలేషిన్షిప్ ముగిసిందంటూ మేగన్ స్కట్ ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ప్రస్తుతం విడిగా ఉంటున్నప్పటికీ మేగన్, జెస్‌లు కలిసి మిరాకిల్ బేబీస్ ఫౌండేషన్‌కు రాయబారులుగా పనిచేస్తూ, నెలలు నిండకుండా పుట్టిన శిశువుల సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. చదవండి: 25 బంతుల్లోనే సెంచరీ బాదిన వైభవ్!


