మెగాటోర్నీకి ముందు ఆసీస్ స్టార్ షాకింగ్‌ నిర్ణయం! | Australia Star Megan Schutt Announces Retirement To International Cricket Before T20 World Cup | Sakshi
Sakshi News home page

మెగాటోర్నీకి ముందు ఆసీస్ స్టార్ షాకింగ్‌ నిర్ణయం!

May 25 2026 5:07 PM | Updated on May 25 2026 5:44 PM

Australia Star-Megan Schutt Retirement Call Before T20 World Cup

ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మేగన్ స్కట్‌ రిటైర్మెంట్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ముగిసిన అనంతరం ఆటకు వీడ్కోలు పలకనున్నట్లు మేగన్ స్కట్ వెల్లడించింది. తర్వాతి జనరేషన్‌కు అవకాశాలు ఇవ్వా లనే ఉద్దేశంతోనే రిటైర్మెంట్ తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఆమె తెలిపింది.

దీంతో మహిళల టీ20 ప్రపంచకప్ మేఘన్ స్కట్‌కు చివరి అంతర్జాతీయ టోర్నీ కానుంది. 33 ఏళ్ల మేగన్ స్కట్ 2012లో 20 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. అనతికాలంలోనే ఆసీస్ స్టార్ ప్లేయర్‌గా పేరు పొందిన మేగన్ స్కట్ ఆ జట్టు తరఫున నాలుగు టెస్టులు, 111 వన్డేలు, 125 టీ20 మ్యాచ్‌లు ఆడింది. 

మొత్తం 240 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన మేగన్ స్కట్‌ 309 వికెట్లు పడగొట్టింది. ఇందులో వన్డేల్లో 148 వికెట్లు, టీ20ల్లో 152 వికెట్లు ఉన్నాయి. మహిళల క్రికెట్ చరిత్రలో వన్డేల్లో అత్యంత వేగంగా వంద వికెట్లు పూర్తి చేసిన రెండో బౌలర్‌గానూ రికార్డులకెక్కింది. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మేగన్‌ అగ్రస్థానంలో ఉంది. అంతేకాదు అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్‌లో హ్యాట్రిక్‌ సాధించిన మొదటి బౌలర్‌గానూ మేగన్‌ రికార్డులకెక్కింది.

ఇక తన రిటైర్మెంట్ ప్లాన్‌పై మేగన్ స్కట్ స్పందించింది. ‘14 ఏళ్ల కెరీర్ నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. తర్వాతి తరానికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయిం చుకున్నా. ఐసీసీ టీ20 ప్రపంచకప్ నాకు చివరి టోర్నీ కానుంది.’ అని చెప్పుకొచ్చింది. 

మేగన్ స్కట్‌.. రెండు వన్డే ప్రపంచకప్‌(2013, 2022)లతో పాటు మూడు టీ20 ప్రపంచకప్‌లు (2108, 2020, 2026) గెలిచిన ఆసీస్ జట్టులో సభ్యురాలిగా ఉంది. జూన్ 12న ప్రారంభం కానున్న మెగా టోర్నీలో ఆస్ట్రేలియా జట్టు తమ తొలి మ్యాచ్‌ను జూన్ 13న సౌతాఫ్రికాతో ఆడనుంది.

లెస్బియన్‌తో వివాహం

అడిలైడ్‌కు చెందిన మేఘ‌న్ స్క‌ట్ తన దీర్ఘకాల భాగస్వామి జెస్ హోలియోక్‌ను వివాహం చేసుకుంది. ఆస్ట్రేలియాలో స్వలింగ వివాహాలు చట్టబద్ధం అయిన తర్వాత 2019లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. 2021 ఆగస్టులో, అత్యవసర సి-సెక్షన్ సరోగసి ద్వారా నెలలు నిండని బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. ఆ బిడ్డ‌కు రైలీ లూయిస్ అని పేరు పెట్టారు. 

అయితే 2025లో జెస్‌తో తన పదేళ్ల రిలేషిన్‌షిప్‌ ముగిసిందంటూ మేగన్‌ స్కట్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంది. ప్రస్తుతం విడిగా ఉంటున్నప్పటికీ మేగన్, జెస్‌లు క‌లిసి మిరాకిల్ బేబీస్ ఫౌండేషన్‌కు రాయబారులుగా పనిచేస్తూ, నెలలు నిండకుండా పుట్టిన శిశువుల సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. 

చదవండి: 25 బంతుల్లోనే సెంచరీ బాదిన వైభవ్‌!

Advertisement
 
Advertisement
Advertisement