మళ్లీ టెస్టుల్లోకి వెటోరీ | Daniel Vettori set for return to test cricket | Sakshi
Sakshi News home page

మళ్లీ టెస్టుల్లోకి వెటోరీ

Nov 26 2014 1:00 AM | Updated on Sep 2 2017 5:06 PM

ఇక క్రికెట్ నుంచి రిటైర్ అవుతాడని అనుకుంటున్న సమయంలో న్యూజిలాండ్ స్పిన్నర్ వెటోరీ అనూహ్యంగా టెస్టు జట్టులోకి వచ్చాడు.

వెల్లింగ్టన్: ఇక క్రికెట్ నుంచి రిటైర్ అవుతాడని అనుకుంటున్న సమయంలో న్యూజిలాండ్ స్పిన్నర్ వెటోరీ అనూహ్యంగా టెస్టు జట్టులోకి వచ్చాడు. రెండేళ్లుగా టెస్టులకు దూరంగా ఉంటూ కేవలం వన్డేలు, టి20లు ఆడుతున్న వెటోరీని... పాకిస్థాన్‌తో బుధవారం జరగనున్న మూడో టెస్టు కోసం న్యూజిలాండ్ సెలక్టర్లు ఎంపిక చేశారు. ముగ్గురు స్పిన్నర్లు జట్టులో ఉండాలని భావించిన సెలక్టర్లు... యూఏఈలోనే న్యూజిలాండ్ ‘ఎ’ జట్టుతో ఉన్న వెటోరీని పిలిపించింది. ఈ మ్యాచ్ ఆడితే న్యూజిలాండ్ తరఫున టెస్టు క్రికెట్ ఆడిన పెద్ద వయస్కుడిగా 35 ఏళ్ల వెటోరీ రికార్డు సృష్టిస్తాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement