ఢిల్లీని గెలిపించిన నవీన్‌ | Dabang Delhi Beat Gujarat Fortunegiants | Sakshi
Sakshi News home page

ఢిల్లీని గెలిపించిన నవీన్‌

Sep 16 2019 3:33 AM | Updated on Sep 16 2019 3:33 AM

Dabang Delhi Beat Gujarat Fortunegiants  - Sakshi

పుణే: ప్రస్తుత ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌లో ఢిల్లీ స్టార్‌ రైడర్‌ నవీన్‌ కుమార్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. మరోసారి సూపర్‌ ‘టెన్‌’ సాధించి అదరగొట్టాడు. దీంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దబంగ్‌ ఢిల్లీ 34–30తో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ను ఓడించింది. నవీన్‌ (12 పాయింట్లు)కు ట్యాక్లింగ్‌లో విశాల్‌ (3 పాయింట్లు), జోగిందర్‌ (3 పాయిం ట్లు) సహకరించడంతో దబంగ్‌ విజయం ఖాయ మైంది. 12 విజయాలతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో ‘టాప్‌’ ప్లేస్‌లో కొనసాగుతోంది. పుణేరి పల్టన్‌తో జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌ 55–33తో ఘనవిజయం సాధించింది. పట్నా రైడర్‌ ప్రదీప్‌ నర్వాల్‌ 18 పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. నేటి మ్యాచ్‌ల్లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌తో యూపీ యోధ; దబంగ్‌ ఢిల్లీతో తెలుగు టైటాన్స్‌ తలపడతాయి.

Advertisement
 
Advertisement
Advertisement