ఆర్సీబీ ప్రతీకారం తీర్చుకునేనా? | CSK Won The Toss And Elected to Field First Against RCB | Sakshi
Sakshi News home page

ఆర్సీబీ ప్రతీకారం తీర్చుకునేనా?

Apr 21 2019 7:41 PM | Updated on Apr 21 2019 7:42 PM

CSK Won The Toss And Elected to Field First Against RCB - Sakshi

బెంగళూరు: ఐపీఎల్‌లో మరో ఆసక్తికర పోరుకు స్థానిక చిన్నస్వామి స్టేడియం వేదికైంది. డిపెండింగ్‌ చాంపియన్‌, పాయింట్ల పట్టికలో  అగ్రస్ధానంలో ఉన్న చెన్నై సూపర్‌కింగ్స్‌తో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తలపడనుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు కేవలం రెండు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న ఆర్సీబీకీ ప్రతీ మ్యాచ్‌ చావోరేవోనే. ఇరుజట్లు ఈ సీజన్‌లో ఓ సారి తలపడగా ఆర్సీబీని సీఎస్‌కే చిత్తుచిత్తుగా ఓడించింది. దాంతో సొంత మైదానంలో ప్రతీకారం తీర్చుకోవాలని ఆర్సీబీ భావిస్తోంది.

ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్‌కు నేరుగా వెళ్లాలని సీఎస్‌కే భావిస్తుండగా.. ధోనిసేనపై తప్పకుండా గెలిచి ప్లేఆఫ్‌ ఆశలు సజీవంగా నిలుపుకోవాలని ఆర్సీబీ తహతహలాడుతోంది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన చెన్నై కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ముందుగా ఆర్సీబీని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

ఆర్సీబీ
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), పార్థివ్‌ పటేల్‌, ఏబీ డివిలియర్స్‌, అక్షదీప్‌ నాథ్‌, మొయిన్‌ అలీ, స్టోయినిస్‌, పవన్‌ నేగీ, డేల్‌ స్టెయిన్‌, నవదీప్‌ షైనీ, చహల్‌, ఉమేశ్‌ యాదవ్‌

సీఎస్‌కే
ఎంఎస్‌ ధోని(కెప్టెన్‌), షేన్‌ వాట్సన్‌, డుప్లెసిస్‌, సురేశ్‌ రైనా, అంబటి రాయుడు, కేదార్‌ జాదవ్‌, డ్వేన్‌ బ్రేవో, రవీంద్ర జడేజా, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ఇమ్రాన్‌ తాహిర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement