రాజకీయాలొద్దు.. చెన్నైలోనే మ్యాచ్‌లు | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 9 2018 4:18 PM

CSK to Play IPL 2018 Matches in Chennai - Sakshi

సాక్షి, ముంబై :  కావేరీ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు వ్యవహారంలో కేంద్రంపై తమిళనాడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వేళ.. ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణపై సంగ్ధిగ్ధం నెలకొంది. మ్యాచ్‌లను అడ్డుకుని తీరతామని ఆందోళనకారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ నిర్వాహకులు స్పందించారు. చెన్నైలోనే మ్యాచ్‌లు నిర్వహించి తీరతామని ఐపీఎల్‌ చైర్మన్‌ రాజీవ్‌ శుక్లా సోమవారం స్పష్టం చేశారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన ‘షెడ్యూల్‌ ప్రకారం చెన్నైలోనే మ్యాచ్‌లు నిర్వహిస్తాం. అవసరమైతే కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తాం. రాజకీయ కారణాలతో ఆట ప్రభావితం కావటానికి వీల్లేదు’ అని రాజీవ్‌ తెలిపారు. 

(ధోనీకి రజనీ విజ్ఞప్తి)

మరోవైపు చెన్నై సూపర్‌ కింగ్స్‌ మేనేజ్‌మెంట్‌ కూడా మ్యాచ్‌ల నిర్వహణపై స్పందించింది. మ్యాచ్‌లను మరో చోట నిర్వహించబోతున్నట్లు(కేరళలో నిర్వహించబోతున్నట్లు...) వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని సీఎస్‌కే ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథన్‌ వెల్లడించారు. ‘మ్యాచ్‌ల తరలింపు విషయంలో బీసీసీఐదే తుది నిర్ణయం. కావేరీ అంశంపై ఎప్పటికప్పుడు మాకు సమాచారం అందుతోంది. చెన్నై పోలీసుల దగ్గరి నుంచి ఇప్పటికే మ్యాచ్‌ నిర్వహణల కోసం అనుమతి తీసుకున్నాం.  అన్ని విషయాలను పరిగణనలోకే తీసుకునే మేం ముందుకు వెళ్తున్నాం అని కాశీ విశ్వనాథ్‌ తెలిపారు. 

Advertisement
Advertisement