దీపక్‌ చాహర్‌ ఐపీఎల్‌ రికార్డు

CSK pacer Deepak Chahar creates IPL record with 20 dot balls vs KKR - Sakshi

చెన్నై: ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ బౌలర్‌ దీపక్‌ చాహర్‌ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెపాక్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన చాహర్.. 20 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే ఇందులో 20 డాట్ బాల్స్ ఉండటంతో విశేషం. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకూ 20 డాట్‌బాల్స్ ఎవరూ వేయలేదు. గతంలో ఆశిష్‌ నెహ్రా, మునాఫ్‌ పటేల్‌, ఫీడెల్‌ ఎడ్వర్డ్స్‌లు ఐపీఎల్‌లో అత్యధికంగా డాట్‌ బాల్స్‌ వేశారు.

ఈ ముగ్గురూ 2009 ఐపీఎల్ సీజన్‌లో 19 డాట్ బాల్స్ వేశారు. అయితే మంగళవారం రాత్రి ఆ సంయుక్త రికార్డును దీపక్ చాహర్ బ్రేక్ చేశాడు.  గత శనివారం కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో దీపక్ చాహర్ వరుసగా రెండు నోబాల్స్ విసరడంతో.. అతనిపై ధోని గుస్సా అయిన సంగతి తెలిసిందే. అయితే ధోని కోపం తర్వాత తప్పిదాల్ని దిద్దుకున్న చాహర్.. ఆ ఓవర్‌లో ఓ వికెట్ పడగొట్టి చెన్నైని గెలిపించాడు. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఏడు వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.  కోల్‌కతా నైట్‌రైడర్స్ 9 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేయగా,  చెన్నై మరో 16 బంతులు మిగిలి ఉండగానే చెన్నైవిజయాన్ని అందుకుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top