ఆ ప్లేయర్ గ్రహాంతరవాసా!.. వైరల్ వీడియో | Cristiano Ronaldo From Out Of Earth Player Video Viral | Sakshi
Sakshi News home page

ఆ ప్లేయర్ గ్రహాంతరవాసా!.. వైరల్ వీడియో

Apr 4 2018 5:33 PM | Updated on Oct 2 2018 8:39 PM

Cristiano Ronaldo From Out Of Earth Player Video Viral - Sakshi

ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో

మాడ్రిడ్ : ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో మైదానంలో చేసే విన్యాసాలు అన్నీ ఇన్నీ కాదు. అతడు మ్యాచ్‌లో ఉన్నాడంటే జట్టు హాయిగా నిద్రపోవచ్చు. రియాల్ మాడ్రిడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రొనాల్డో జువెంటస్ తో జరిగిన మ్యాచ్‌లో చేసిన గోల్ హాట్ టాపిక్‌గా మారింది. గాల్లోకి పక్షిలా ఎగురుతూ చేసిన ఆ గోల్‌ను సైకిల్ కిక్ గోల్ అని ప్రశంసిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో జువెంటస్‌పై 3-0తో నెగ్గిన రియల్ మాడ్రిడ్ జట్టు ఛాంపియన్స్ లీగ్ సెమీఫైనల్స్‌లో ప్రవేశించింది. రొనాల్డో చేసిన గోల్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే కామెంటేటర్ లెబ్రాన్ జేమ్స్ రొనాల్డోపై ప్రశంసల జల్లులు కురిపించాడు. ఈ ఫుట్‌బాల్ ప్లేయర్ ఏ గ్రహం నుంచి వచ్చాడు. అతడు గ్రహాంతరవాసి. లేకపోతే అతడికి ఈ విన్యాసాలు ఎలా సాధ్యమని అభిప్రాయపడ్డారు. గోల్‌కు సంబంధించి ఓ వీడియోను పోస్ట్ చేశారు. రొనాల్డోను 'డి స్టెఫానో 2.0'గా అభివర్ణిస్తున్నారు. దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్ స్టెఫానో రాణించడంతో రియల్ మాడ్రిడ్ వరుసగా ఐదుసార్లు యూరోపియన్ కప్ సొంతం చేసుకుంది. మూడు యూరోపియన్ టోర్నీ ఫైనల్లో గోల్ చేసిన ఆటగాడిగానూ రొనాల్డో నిలిచాడు. గతంలో పక్షిలా గాల్లోకి ఎగురుతూ ఎన్నో కీలక మ్యాచ్‌ల్లో తన జట్టుకు గోల్స్ అందించిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement