కుప్పకూలిన క్రికెట్‌ స్టాండ్ | Cricket stand collapses during England international match leaving at least three injured | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన క్రికెట్‌ స్టాండ్

Sep 17 2017 4:30 PM | Updated on Sep 19 2017 4:41 PM

కుప్పకూలిన క్రికెట్‌ స్టాండ్

కుప్పకూలిన క్రికెట్‌ స్టాండ్

ఎమిరేట్స్‌ రివర్‌సైడ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో జరుగుతున్న ట్వంటీ-20 క్రికెట్‌ మ్యాచ్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది.

దుర్హామ్‌ : ఇంగ్లాండ్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య ఎమిరేట్స్‌ రివర్‌సైడ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో జరుగుతున్న ట్వంటీ-20 క్రికెట్‌ మ్యాచ్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. స్టేడియంలో ఈశాన్యం దిశలో ప్రేక్షకులు కూర్చుని ఉన్న స్టాండ్‌లో ఓ భాగం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రేక్షకులు గాయాల పాలయ్యారు.

దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న భద్రతా సిబ్బంది ఆ స్టాండ్‌లోని ప్రేక్షకులను వేరే స్టాండ్‌కు పంపారు. కాగా, మ్యాచ్‌కు వారం రోజుల ముందు జరిగే పరీక్షలన్నింటిలో సదరు స్టాండ్‌కు మంచి మార్కులు వచ్చినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement