గెలిచి నిలిచిన పెరూ | Copa America 2015: Peru 1-0 Venezuela | Sakshi
Sakshi News home page

గెలిచి నిలిచిన పెరూ

Jun 20 2015 12:36 AM | Updated on Sep 3 2017 4:01 AM

గెలిచి నిలిచిన పెరూ

గెలిచి నిలిచిన పెరూ

కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీ లో పెరూ జట్టు తమ నాకౌట్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. తొలి మ్యాచ్‌లో బ్రెజిల్ చేతిలో

వెనిజులాపై 1-0తో విజయం
 కోపా అమెరికా కప్

 
 వాల్‌పరైసో (చిలీ): కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీ లో పెరూ జట్టు తమ నాకౌట్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. తొలి మ్యాచ్‌లో బ్రెజిల్ చేతిలో ఓడిన ఈ జట్టుకు గురువారం వెనిజులాతో జరిగిన కీలక పోరులో వెటరన్ స్ట్రయికర్ క్లాడియో పిజారో (72వ ని.) కీలక విజయాన్ని అందించాడు. దీంతో గ్రూప్ ‘సి’లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో పెరూ 1-0తో నెగ్గింది. ఈ ఫలితంతో ఈ గ్రూపు నుంచి క్వార్టర్స్‌కు చేరే విషయంలో అన్ని జట్లకు సమాన అవకాశాలు లభించినట్టయ్యింది. నాలుగు జట్లు మూడేసి పాయింట్లతో ఉన్నాయి.
 
 ఇక తమ చివరి గ్రూపు మ్యాచ్‌లో కొలంబియాతో పెరూ; వెనిజులాతో బ్రెజిల్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ప్రారంభం నుంచి హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత వెనిజులా ఆధిక్యం ప్రదర్శించింది. ఆరో నిమిషంలోనే గోల్ చేసే అవకాశం వచ్చినా విఫలమైంది. దూకుడుగా ఆడే క్రమంలో 30వ నిమిషంలో ప్రత్యర్థి ఆటగాడు గెరీరోను ప్రమాదకరంగా ఢీకొనడంతో వెనిజులా డిఫెండర్ అమోరెబీటా రెడ్‌కార్డ్‌కు గురై మైదానం వీడాడు. దీంతో 10 మందితోనే ఆ జట్టు ఆడాల్సి రావడంతో లయ దెబ్బతింది. ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకున్న పెరూ విజృంభించింది. మ్యాచ్ మరో 18 నిమిషాల్లో ముగుస్తుందనగా పిజారో కొట్టిన షాట్ గోల్ పోస్టు పై నెట్‌కి తాకుతూ లోనికి చేరడంతో జట్టు సంబరాల్లో మునిగింది.
 
 కోపా అమెరికా కప్‌లో నేడు
 ఉరుగ్వే ఁ పరాగ్వే
 రాత్రి గం. 12.30 నుంచి
 అర్జెంటీనా ఁ జమైకా
 తెల్లవారుజామున గం. 3.00 నుంచి
 సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
 

Advertisement
 
Advertisement
Advertisement