మహిళల టీ 20: ఫైనల్కు చేరిన విండీస్ | Cooper, spinners take WI Women to maiden final | Sakshi
Sakshi News home page

మహిళల టీ 20: ఫైనల్కు చేరిన విండీస్

Mar 31 2016 6:00 PM | Updated on Sep 3 2017 8:57 PM

మహిళల టీ 20: ఫైనల్కు చేరిన విండీస్

మహిళల టీ 20: ఫైనల్కు చేరిన విండీస్

మహిళల టీ 20 ప్రపంచకప్లో వెస్టిండీస్ ఫైనల్ కు చేరింది.

ముంబై: మహిళల టీ 20 ప్రపంచకప్లో వెస్టిండీస్ ఫైనల్ కు చేరింది. గురువారం న్యూజిలాండ్ తో ఇక్కడ వాంఖడే స్టేడియంలో జరిగిన రెండో  సెమీ ఫైనల్లో విండీస్ ఆరు పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది.  టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ తీసుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన  విండీస్ 20.0 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. విండీస్ ఓపెనర్లు హైలే మాథ్యూస్(16) విఫలం కాగా, స్టఫానీ టేలర్(25)ఫర్వాలేదనిపించింది. అనంతరం కూపర్(61) దాటిగా ఆడగా, డాటిన్ (20) మోస్తరుగా ఆడటంతో విండీస్ గౌరవప్రదమైన స్కోరు చేసింది.

అనంతరం 144 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 137 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. న్యూజిలాండ్ మహిళల్లో డివైన్(22), మెక్ గ్లాషన్(38), సాటర్ వైట్(24) మినహా ఆకట్టుకోలేకపోవడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. ఏప్రిల్ 3వ తేదీన ఆస్ట్రేలియా-విండీస్ జట్ల మధ్య కోల్ కతాలో తుదిపోరు జరుగనుంది.

Advertisement
 
Advertisement
Advertisement